NTV Telugu Site icon

Ambati Rambabu: చంద్రబాబు ఆరోగ్యం గురించి డాక్టర్లు చెప్పాలి.. టీడీపీ నాయకులు కాదు..!

Ambati

Ambati

చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మధు ఖోడా, సిబు సోరేన్, జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు విషయంలో కూడా అంతే.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసింది.. ఎవరి మీద కక్ష్య సాధించాలి అన్న ఉద్దేశ్యం వైసీపీ ప్రభుత్వానికి లేదు అని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ పై అవాకులు చవాకులు పేలుతున్న నాయకులు అది గుర్తు పెట్టుకోవాలి.. పురంధేశ్వరి ఏ పార్టీ అధ్యక్షురా లో తెలియాలి.. ఎన్టీఆర్ కుమార్తెకు అధికారం ఉన్న పార్టీలలో చొరబడడం, చంద్రబాబును కాపాడటం అలవాటు అయిపొయింది అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

Read Also: BRS Manifesto Live updates: బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. లైవ్ అప్‌డేట్స్

అమిత్ షాకు చెప్పుకున్న స్పందన లేదు.. నిజాలు తెలుసుకునే కేంద్రం మౌనంగా ఉండిపోయింది అంటూ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం టీడీపీ నాయకులు నారా లోకేశ్, భువనేశ్వరి చేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ముందు నుండే చర్మ సంబంధ వ్యాధి ఉంది.. రాజకీయ లబ్ది పొందటానికి అనారోగ్యం ప్రచారం జరుగుతుంది.. చంద్రబాబు ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే ముందే ఏసీ అడాగాలి కదా అని ఆయన ప్రశ్నించారు.

Read Also: Jagtial: బహుమతులుగా గొర్రె పొట్టేలు, మందుబాటిల్.. ఓ షాపు యజమాని వినూత్నంగా ఆఫర్..

జుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు కోర్టు అనేక సదుపాయాలు ఇచ్చింది అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రత్యేక ఆహారం, మందులు తీసుకునే అవకాశం ఇచ్చారు.. 17a ప్రకారం చంద్రబాబుపై కేసు కొట్టేయాలని చేసిన డిమాండ్ ను కోర్టులు తిరస్కరించాయి.. తప్పు చేశాడు కాబట్టి, సాక్ష్యాలను తారు మారు చేస్తాడనే ఉద్దేశంతో కోర్టులు ఇప్పటి వరకు చంద్రబాబుకు బెయిల్ కూడా ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం విషమం అని కొత్త ప్రచారాలు చేస్తున్నారు.. చంద్రబాబు ఇంటి నుంచి వచ్చే ఆహారంలో స్టెరాయిడ్స్ ఎవరు కలిపి ఇస్తున్నారు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

Read Also: Minister MallaReddy: మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది.. కేసీఆర్ పులి.. ఎవరికి భయపడే వ్యక్తి కాదు..

చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్ లు చెప్పాలి.. టీడీపీ నాయకులు కాదు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచిన యనమల, చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. జైలుకు వెళ్లిన తర్వాత చంద్రబాబు బరువు తగ్గ లేదు.. కిలో బరువు పెరిగాడు.. జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ లో ఉన్న చంద్రబాబుకు కోర్టు ఆదేశాల ప్రకారం మాత్రమే సౌకర్యాలు ఉంటాయి.. జైలు అధికారులు నిబంధనల ప్రకారమే నడుచుకుంటారు.. చంద్రబాబు ఏసీ అడిగిన గంటలో కోర్టు అనుమతించింది.. చంద్రబాబును హాస్పిటల్ కు తరలించాలంటే ఆ నిర్ణయం కూడా కోర్టు తీసుకుంటుంది.. చంద్రబాబు ఖరీదైన లాయర్లను పెట్టుకున్నా.. బెయిల్ ఎందుకు రావడం లేదో టీడీపీ కార్యకర్తలు ఆలోచించాలని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.