Jagtial: బహుమతులుగా గొర్రె పొట్టేలు, మందుబాటిల్.. ఓ షాపు యజమాని వినూత్నంగా ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial: దేశవ్యాప్తంగా దసరా, దీపావళి పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ పండుగలు వస్తే.. వ్యాపార సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక తగ్గింపులు ఇస్తారు. బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లు కూడా ప్రత్యేక ఆఫర్ సేల్స్‌ను ప్రారంభించనున్నాయి. ఒక చీర కొనండి, మరో చీరను ఉచితంగా పొందండి, చీరలపై 50 శాతం తగ్గింపు వంటి పలు ఆఫర్లను కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు దుస్తుల దుకాణాలు ప్రకటిస్తున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ దుకాణాలు మొదలైనవి లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తాయి.
అయితే జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ షాపు యజమాని వినూత్నంగా ఆలోచించాడు. ఎలాంటి వస్తువులను అమ్మకానికి పెట్టకుండా దసరా మెగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నాడు. ఇందులో ఏదో విచిత్రం ఉందని అనుకుంటున్నారా? లక్కీ డ్రా వేయడంలో వింత ఏమీ లేదు కానీ ఆయన ప్రకటించిన బహుమతులు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా గొర్రె పిల్ల, ద్వితీయ బహుమతిగా మేక, తృతీయ బహుమతిగా మద్యం సీసా, నాల్గవ బహుమతిగా కోడి, ఐదో బహుమతిగా నాటు కోడి అని ఆయన ప్రకటించారు. ధర్మపురి పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మేనేజర్ మణికంఠ ఈ లక్కీ డ్రాను ప్రకటించారు. అయితే ఈ లక్కీ డ్రాలో పాల్గొనేందుకు రూ. 50 పెట్టి కూపన్ కొనడానికి షరతు. ప్రజలను మోసం చేసే ఉద్దేశం తమకు లేదని.. ఒక్కొక్కరికి 5 కూపన్లు మాత్రమే ఇస్తామని ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు విడుదల చేసిన బ్రోచర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇవి కానుకలు బాసూ.. ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయి’ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Minister MallaReddy: మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది.. కేసీఆర్ పులి.. ఎవరికి భయపడే వ్యక్తి కాదు..
Also Read
- TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!