AP Election 2024: రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి.. రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.. ఇక, వైసీపీ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. టీడీపీ, జనసేన ఎన్నికలకు ముందే ఓటమి అంగీకరించే పరిస్థితి ఉందన్నారు. కుప్పంలో భువనేశ్వరి పోటీ చేస్తారంట.. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు అని తెలుసుకున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ ఘనవిజయం సాధించినప్పుడే, చంద్రబాబు ఓటమి ఖాయం అయిపోయిందన్నారు కుప్పానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా తాగు, సాగునీరు ఇవ్వబోతున్నాం… కుప్పంలో చంద్రబాబు బండారం బయటపడింది.. గతంలో దొంగ ఓట్లతో కుప్పంలో గెలిచిన చంద్రబాబుకు ఈసారి అలాంటి ఛాన్స్ లేదన్నారు. కుప్పంలో నిలబడి ఓడిపోవడం కంటే రెస్ట్ తీసుకోవడం బెటర్ అని చంద్రబాబుకు తెలుసంటూ సెటైర్లు వేసిన ఆయన.. అందుకే భువనేశ్వరి నేను పోటీ చేస్తాను అంటున్నారని దుయ్యబట్టారు.
Read Also: Jharkhand: హేమంత్ సోరెన్‌కు కోర్టులో చుక్కెదురు
రాబోయే ఎన్నికల్లో డబ్బు పెట్టి గెలవాలని చేగువేరా వారసుడు అని చెప్పుకునే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు అంబటి.. బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో మంతనాలు చేస్తే పార్టీలు తిట్టవా..? అని ప్రశ్నించారు. ఒక పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకుండా, మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటే జాతీయ పార్టీలు తిట్టకుండా ఏం చేస్తాయన్న ఆయన.. టీడీపీ-జనసేన గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి… ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో వాళ్లకే తెలియడం లేదన్నారు. చంద్రబాబు రెస్ట్ తీసుకునే మూడ్‌లో ఉన్నాడు.. భవిష్యత్తులో టీడీపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. రెస్ట్ తీసుకోవడమే మిగిలిందన్నారు.
Read Also: Hyderabad: నగరంలోని బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో సోదాలు..
గతంలో కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వ్యక్తి, ఇప్పుడు టీడీపీలో చేరి.. నా మీద పోటీకి వస్తున్నాడు.. జాతీయ పార్టీలో ఉండి ఆ పార్టీకి ద్రోహం చేసిన విశ్వాస ఘాతకుడు అని మండిపడ్డారు అంబటి.. ఇప్పుడు వైసీపీ ఎంపీ అనిల్ మీద పోటీ చేయడానికి వస్తున్న వ్యక్తి, వైసీపీ వల్ల ఎంపీ అయి పార్టీకి నమ్మకద్రోహం చేసిన విశ్వాసఘాతకుడు అని విరుచుకుపడ్డారు. ఇలాంటి వాళ్లకు ఓట్లు వేస్తామా లేదా ? ప్రజల ఆలోచించుకోవాలన్న ఆయన.. విశ్వాస పాత్రులకు ఓటు వేస్తారా? విశ్వాసఘాతకులకు ఓటు వేస్తారా? వారే తేల్చుకోవాలన్నారు. ఎన్టీఆర్ కు నమ్మకద్రోహం చేసిన విశ్వాసఘాతకుల పార్టీ టీడీపీ.. నమ్మకద్రోహుల ముఠాగా టీడీపీ నాయకులు మారిపోయారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.