NTV Telugu Site icon

Ambati Rambabu: చికిత్స కోసం మాత్రమే చంద్రబాబుకు బెయిల్.. నిర్దోషి అని కాదు..!

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం విదితమే.. అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయనకు వచ్చే నెల 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది హైకోర్టు.. 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తమ పార్టీ అధినేత బయకు రానుండడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.. అయితే, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై స్పందిస్తూ సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. హై కోర్టులో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారన్న ఆయన.. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని టీడీపీ నాయకులు హంగామా చేస్తున్నారు.. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానాలి.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.

Read Also: Brahmanandam: ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం!

ఈ కేసులో నిర్దోషి అని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేదు.. అనారోగ్య కారణాలతో మాత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు మంత్రి అంబటి.. డాక్టర్ లు ఇచ్చిన నివేదిక ప్రకారం చికిత్స కోసం మాత్రమే చంద్రబాబు కు బెయిల్ వచ్చింది.. కంటి వైద్య కోసం మానవతా దృక్పథంతో కోర్టు బెయిల్ ఇచ్చిందన్న ఆయన.. యుద్ధం ఇప్పుడే మొదలైందని నారా లోకేష్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.. ఈ కేసులో చాలా విచారణ మిగిలే ఉంది.. విదేశాలకు పారిపోయిన నిందితులను తీసుకు వచ్చి విచారణ చేయించాలన్నారు. 1983లో ఎక్కడైతే ఎన్టీఆర్ జెండా ఎగుర వేశాడో.. అక్కడ టీడీపీ జెండా పీకేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు, ఆంధ్రలో త్వరలో పీకేస్తారు.. ఇది నిజం అంటూ జోస్యం చెప్పారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయ్యింది.. అందుకే టీడీపీకి రాజీనామా చేశాడు.. ఎన్టీఆర్‌ను చంపిన చేతులతోనే ఆయన పెట్టిన టీడీపీని కూడా చంపేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.