Ambati Rambabu: తన ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లిలోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సత్తెనపల్లే తన నివాసప్రాంతమని ఆయన అన్నారు. ఈ విషయంలో రాజకీయాలతో సంబంధం లేదన్నారు. సత్తెనపల్లి తన ప్రాంతంగా తాను నిర్ణయించుకున్నానన్నారు. సీట్ల విషయంలో వైఎస్ జగన్‌దే అంతిమ నిర్ణయమన్నారు. నేనైనా ఇంకొకరైనా దానికి అతీతులం కాదన్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ సీట్ల కోసం ఎవరైనా పోటీ పడవచ్చని ఆయన పేర్కొ్న్నారు.
Read Also: Software Employee Case: ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్.. తమ్ముడి వివాహేతర సంబంధమే కారణం!
సత్తెనపల్లిలో కొందరు సీటు కోసం చేస్తున్న ప్రయత్నం పార్టీ అంతర్గత వ్యవహారమని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో అలాంటివి సహజమన్నారు. సత్తెనపల్లిలో అసంతృప్తుల వ్యవహారం ఎలా పరిష్కరించుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు. రేపు సీఎంతో జరిగే ఎమ్మెల్యేల సమావేశం, సాధారణ సమావేశమేనని, సంచలన నిర్ణయాలు ఏమి ఉండవని మంత్రి స్పష్టం చేశారు.