NTV Telugu Site icon

Minister Amarnath: మేం దేనికైనా సిద్దం.. కలిసి‌ వస్తున్న పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్దం..

Amrnath

Amrnath

భీమిలీలో వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభ దగ్గర ఎన్టీవీతో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మేం దేనికైనా సిద్దం.. అభివృద్ధి చూపించేందుకు సిద్దం.. కలిసి ‌వస్తున్న రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. వైనాట్ 175 నినాధం మొదటి నుంచి వినిపిస్తున్నాం.. నేడు అదే నినాధంతో సిద్దమౌతున్నాను అని ఆయన వెల్లడించారు. రెండు సీట్లు టీడీపీ ప్రకటిస్తే, రెండు జనసేన ప్రకటించింది.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెరో 175 సీట్లు చొప్పున ప్రకటిస్తే ఏ గొడవ ఉండదు కదా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబుకు ఏ ధర్మం లేదు.. ధర్మానికి అర్దం తెలియదన్నారు. ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తాం.. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో లేదు.. రాష్ర్టంలో లే‌ని పార్టీకి అధ్యక్షుడు దానికి తిరిగి సమాదానం చెప్పడం అవసరం లేదన్నారు. ఎవరు ఎక్కడ నుంచి పొటీ చేసినా జగన్ ను చూసి ఓటు వేస్తారు.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని ఆయన వెల్లడించారు.

Read Also: Ration Card E- KYC: రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో నాలుగు రోజులే ఛాన్స్..

ఇక, ఎన్టీవీతో ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నర ఏండ్లలో ఏం చెసామో అది చెప్పి అదరించాలని కోరనున్నాం.. ఎంత మంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మాకు జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయువుపట్టు అని పేర్కొన్నారు. మాకు ఏ స్టార్ క్యాంపెయినర్ అవసరం లేదు.. ప్రజలు కార్యకర్తలే జగన్ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తారు అని ఆయన తెలిపారు. మా భరోసా ‌కూడా అదే.. ఇంకా కూడా నాలుగైదు చోట్ల మార్పులు చేర్పులు ఉంటాయి.. ఎక్కడ పార్టీ పరిస్థితి లోకల్ నాయకత్వం బాలేకుంటే మార్పులు తప్పవు.. 175కి 175 సాధించాలని అనుకుంటున్నాం.. నాయకులు, కార్యకర్తలలో ఎలాంటి అసమ్మతి లేదు అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.