Site icon NTV Telugu

Minister Amarnath: బీజేపీతో సంసారం, చంద్రబాబుతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్

Minister Amarnath

Minister Amarnath

Minister Amarnath: వారాహి యాత్రకు వస్తున్న పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారాహి వెబ్ సిరీస్ 3 అంటూ వ్యాఖ్యానించారు మంత్రి. ఉత్తరాంధ్రలో అక్రమాలు అన్యాయాలపై ప్రశ్నిస్తానంటున్న ప్యాకేజ్ స్టార్ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అమర్నాథ్. పవన్‌కు పది ప్రశ్నల పేరుతో మంత్రి అమర్‌నాథ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. విధానం అంటూ లేని పార్టీ జనసేన అంటూ మంత్రి విమర్శించారు. పవన్ కళ్యాణ్ మొదటి అన్యాయం చేసింది ఉత్తరాంధ్రకేనని.. విశాఖకు చెందిన కాపు బిడ్డను పెళ్లి చేసుకుని మోసం చేశారని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. బీజేపీతో సంసారం, చంద్రబాబుతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. వారాహి యాత్ర ఎందు కోసమో ప్రజలకు చెప్పాలన్నారు. వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

బ్రో…..తుస్సు బ్రో అంటూ మంత్రి వ్యంగ్రాస్త్రాలు సంధించారు. బ్రో సినిమాకు మొదటి రోజు సాయంత్రమే ఖాళీ అయిందని.. సినిమాలో కథ లేకపోతే ఎవరు చూడరన్నారు. జగన్మోహన్ రెడ్డిలో హీరోను చూశారు కనుకే జనం ఓట్లు వేశారన్నారు. పవన్‌ది చిన్నపిల్లల మనస్తత్వమన్న మంత్రి అమర్‌నాథ్.. తమకు నచ్చని వ్యక్తులను సినిమాల్లో తప్పుగా చిత్రీకరించడం ద్వారా సంతృప్తిపడే తత్వమని ఆయన మండిపడ్డారు. 175సీట్లు పోటీ చేసే సత్తా ఉంటే చంద్రబాబుకు బంట్రోతు తనం చేయాలిసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

Also Read: Purandeshwari: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి..

మంత్రి అమర్‌నాథ్‌ పవన్‌కు సంధించిన ప్రశ్నలు ఇవే..

1. గాజువాకలో ఓడిపోయినందుకు వారాహి విజయ యాత్ర చేస్తున్నారా….?.

2. 175స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను పవన్ ప్రకటించగలరా…?.

3. రాజధానిని స్వాగతించలేని పవన్‌కు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే అర్హత ఉందా…?

4. బాబు తానా అంటే తందానా అనడం కాకుండా ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధిపై మీ ఆలోచన చెప్పాలి.

5. బీజేపీ భాగస్వామ్యంలో ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు బాధ్యత తీసుకోలేదు.

6. టీటీడీ ఛైర్మన్ పదవిపై రాద్దాంతం చేస్తున్న ప్యాకేజ్ స్టార్‌కు టీడీపీ హయాంలో కూల్చేసిన 40 గుళ్లు కనిపించ లేదా?

7.చంద్రబాబు ప్యాకేజ్ తీసుకుని పోలవరంపై టీడీపీకి వంత పాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదా?

8. స్పెషల్ స్టేటస్‌పై పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టం చేయాలి…

9. ఉద్దానం సమస్యలపై పట్టించుకోని పవన్ కళ్యాణ్.. హాస్పిటల్ పెట్టి., రక్షిత మంచినీరు సరఫరా చేస్తుంటే కనీసం అభినందించలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదా?

10. అల్లర్లు సృష్టించేందుకే చంద్రబాబు రాష్ట్రంలో పర్యటనలు చేస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు?

Exit mobile version