NTV Telugu Site icon

Minister Amarnath: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా.. టీడీపీకి అధ్యక్షులా..?

Amrnath

Amrnath

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతరీ మారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా.. బాబుగారు జనతా పార్టీకి అధ్యక్షులో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. మరిది గారు స్కిప్ట్ చిన్నమ్మ మాట్లాడింది అని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఎక్కడకు వెళ్లిన ఇదే సినిమా స్క్రిప్టు.. తండ్రి పార్టీ మరిది నడుపుతారు.. వీరు వేరే పార్టీని నడుపుతారు.. టీడీపీలో చేరి అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరి తీసుకుని మాట్లాడితే బాగుండేది అని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: Online Love Story: ప్రియుడిని పెళ్లాడేందుకు చైనా నుంచి పాకిస్థాన్‌కు.. సరిహద్దు దాటిన మరో ప్రియురాలు

మాయల ఫకీరు చంద్రబాబు మాయలో పడి దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయంగా దెబ్బతిన్నారు.. మీరు ఆ కోవలోకే వెళతామంటే మీ ఇష్టం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది.. మిడ్ డే మీల్స్ కు 400 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 1500కోట్లు ఖర్చు చేసింది.. అటువంటప్పుడు మిగులు నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలు కట్టిన పన్నులు తిరిగి కేంద్రం పంపిణీ చేస్తోందా లేక నోట్లేమైనా ముద్రించి పంపుతున్నారా అని అమర్నాథ్ అడిగారు. ఏపీ కట్టే ట్యాక్సులు, కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు రావాలసి ఆయన సవాల్ విసిరారు.

Read Also: Beekeeping: తేనేటీగల పెంపకం వల్ల లాభాలు వస్తాయా?

దేశంలో మిగిలిన చాలా రాష్ట్రాల కంటే ఎక్కువ పన్నులు కడుతున్నాం.. వాల్తేర్ డివిజన్ తో కూడిన రైల్వే జోన్ ఇస్తామని చెబితే సీఎంతో మాట్లాడి 24గంటల్లో భూములు కేటాయిస్తామని మంత్రి అమర్నాత్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఓపెన్ గా చెబుతున్నాను.. టీడీపీ హయాంలో జరిగిన భూ దోపిడీలు చిన్నమ్మకు గుర్తు లేవా.. గీతం యూనివర్సిటీ భూ అక్రమాలు కనిపించలేదా..? హ్యూమన్ కేపిటల్ మీద పెట్టుబడి పెడితే పేదరికం తగ్గుతుందని నీతి ఆయోగ్ చెప్పింది మార్చిపోయారా అని అమర్నాథ్ అన్నారు.

Read Also: The Marvels: మళ్ళీ ఏకమవనున్న సమంత, తమన్నా, కాజల్, రకుల్?

మాయల ఫకీర్ మరిది మాయలో పడితే పురందేశ్వరి చరిత్ర కూడా ముగిసినట్టేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని స్వాధీనం చేసుకుని అప్పుడు రాజకీయం చేయండి.. కన్నా లక్ష్మీనారాయణను మించి పురంధేశ్వరి వ్యాఖ్యలు చేస్తున్నారు.. 13 లక్షల కోట్లకు పైగా ఇన్వేస్టర్స్ సమ్మిట్ లో ఒప్పందాలు జరిగాయి.. అవన్నీ కార్యరూపంలోకి వస్తున్నాయి.. చంద్రబాబు హయాంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో గూర్ఖాలు పండగ చేసుకున్నారంటూ విమర్శించారు. మణిపూర్ వెళ్లి చూస్తే అరాచకాలు అంటే ఏంటో పురందేశ్వరికి అర్ధం అవుతుంది.. మరిదిని ముఖ్యమంత్రి చేసేయాలనే తపత్రయంలో పురంధేశ్వరి ఉన్నారు.

Read Also: V.Hanumantha Rao : నగరం మాములు వర్షాలకు సైతం ముంపుకు గురవుతోంది..

జగన్ మోహన్ రెడ్డిపై యుద్దానికి ముసుగు లేసుకుని వస్తున్నారు అని మంత్రి అమర్నాథ్ అన్నారు. 2024లో ఇప్పుడున్న సీట్ల కంటే ఎక్కువ స్థానాలతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బాబుగారి జనతా పార్టీలో అధ్యక్షులు, కోవర్డు ఎంపీలు ఎందరు వచ్చిన విజయం మాదేనని ఆయన తెలిపారు. అధికారికంగా బీజేపీలో ఉండి.. పురందేశ్వరి అనధికారికంగా టీడీపీ వ్యవహారాలు చెప్పొద్దని అమర్నాథ్ అన్నారు. 20 లక్షల ఇళ్లను ఏపీలో నిర్మాణిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతుంటే… పురందేశ్వరి అందుకు భిన్నంగా మాట్లాడితే ఎవరి మాట నమ్మాలి.. హౌసింగ్ పై
పురందేశ్వరి చేస్తున్న ఆరోపణలుకు ఓపెన్ ఛాలెంజ్ కు సిద్ధమా అని సవాల్ విసిరాడు.