Beekeeping: తేనేటీగల పెంపకం వల్ల లాభాలు వస్తాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశం అంటే రైతన్నలు ఉన్న పుణ్య దేశం అంటారు పెద్దలు.. వ్యవసాయం చేస్తూ నలుగురికి కడుపు నింపుతున్నారు.. ఒక్క పంటలు పండించడం ఒక్కటే అనేక రకాలుగా చేస్తున్నారు. అందులో ఒక్కటి తేనేటీగల పెంపకం.. తేనేకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో తేనె పరిశ్రమ చాలా ముఖ్యమైంది. రైతులు కేవలం పంటల సాగుపై ఆధారపడితే వరదలు, కరువు కాటకాలతో నష్టపోయే ప్రమాదం ఉంది.. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోడితో పాటు తేనెటీగల పెంపకం కూడా చేపట్టాలి. అందరికీ ఈఅవకాశం లేకపోయినా ప్రతి గ్రామంలో పంటలు సాగు చేసే ప్రాంతాల్లో మాత్రం తేనె పరిశ్రమ నడిపించవచ్చంటున్నారు నిపుణులు.. మరి ఆలస్యం ఎందుకు తేనేటీగల పెంపకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్ ను కూడా అందుబాటులో ఉంచింది. పలు రంగాలకు సంబంధించి ఈపథకాలు అమలులో ఉన్నాయి. వీటిల్లో జాతీయ తేనెటీగల పెంపకం , తేనె మిషన్ కూడా ఒకటి. 2020లో ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించింది.ఒక్క రైతులు మాత్రమే కాదు, ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ మిషన్ ద్వారా సాయం అందుకుని తేనె పరిశ్రమను నడిపించవచ్చంటున్నారు అధికారులు.. అదే విధంగా తేనెటీగల పెంపకం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం, తేనె, ఇతర తేనె ఉత్పత్తుల మూలాన్ని గుర్తించడం కోసం బ్లాక్‌చెయిన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పలు ప్రాంతాలలో తేనె కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తిలో అగ్రి ఎంట్రప్రెన్యూర్స్, అగ్రి-స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులు, తేనెటీగల పెంపకందారుల మధ్య వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహిస్తున్నారు.. స్వయం ఉపాధి కింద ఈ పెంపకం చేపట్టడానికి ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది..
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
తేనెటీగల పెంపకం అనేది రైతులకు, ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. తేనెటీగల పెంపకం యొక్క ప్రయోజనాలు అనేకం. పరపరాగ సంపర్కం ద్వారా పండ్లు, కూరగాయలు, నూనెగింజలు వంటి తదితర ఉత్పత్తుల నాణ్యత, పరిమాణం పెరుగుతుంది. పర్యావరణం, వ్యవసాయం రంగంలో స్థిరమైన అభివృద్ధికి సహాయపడుతుంది. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇకపోతే తేనేటీగల పెంపకం చేపట్టేవాళ్ళు ముందుగా హైదరాబాద్ లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.. అప్పుడే వాటి పెంపకం పై అవగాహన పెరుగుతుంది.. అలాగే ఆదాయం పెరుగుతుంది..
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!