Site icon NTV Telugu

Adluri Laxman Kumar: పనిలో నిజాయితీగా ఉండాలి.. పార్టీ కోసం పనిచేయాలి!

Adluri Laxman

Adluri Laxman

అందరి కృషి, ఆశీర్వాదంతో తనకు మినిష్టర్ పదవి దక్కిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పనిలో నిజాయితీగా ఉండాలని, నిత్యం పార్టీ కోసం పనిచేయాలన్నారు. మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని చెప్పారు. కష్టాల్లో తోడుగా నిలిచిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని, ఆయనకు ఎప్పుడూ అండగా నిలుస్తానని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం లేదు? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాలకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

జగిత్యాల టౌన్ హాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ… ‘అందరి కృషి, ఆశీర్వాదంతో మంత్రి పదవి దక్కింది. పనిలో నిజాయితీగా ఉండాలి, పార్టీ కోసం పనిచేయాలి. రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేసి.. 42 శాతం రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం లేదు. మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తాను. కష్టాల్లో తోడుగా నిలిచిన జీవన్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతా. జీవన్ రెడ్డికి ఎప్పుడూ అండగా నిలుస్తాను. ధర్మపురి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, చొప్పదండి నియోజక వర్గాల కార్యకర్తలు, నాయకుల సలహాలు తీసుకుంటూ.. అందరి సమస్యలు పరిష్కరిస్తాను’ అని చెప్పారు.

Also Read: Konda Vishweshwar Reddy: నేను బీఆర్ఎస్ పార్టీని వీడడానికి కారణం అదే!

అనంతరం జగిత్యాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ 15 నెలల్లో నేను చేసిన పనులను గుర్తించి అధిష్టానం మంత్రిని చేసిందన్నారు. రాజకీయంగా ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా.. అందరిని కలుపుకుపోయే బాధ్యత అధిష్టానం తనపై పెట్టిందన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.

Exit mobile version