Site icon NTV Telugu

Adluri Laxman: ఆ ఇద్దరు నాకు రెండు కళ్లు.. వారి సహకారంతోనే ఇంతటి వాడిని అయ్యా!

Adluri Laxman

Adluri Laxman

మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు రెండు కళ్లు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి సహాయ సహకారాలతోనే తాను ఇంతటి వాడిని అయ్యాను అని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు వచ్చిందని, తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా అన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.

Also Read: Thatikonda Rajaiah: కడియం దగ్గర భజనపరుల సంఖ్య పెరుగుతోంది!

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం మంత్రి అడ్లూరి మాట్లాడుతూ… ‘మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాకు రెండు కళ్లు. వారి ఇద్దరి సహాయ సహకారాలతోనే నేను ఇంతటి వాడిని అయ్యాను. ఒక సామాన్య కార్యకర్తను అయిన నేను ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దయతో, ధర్మపురి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే, విప్, మంత్రిని అయ్యాను. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చింది, తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా. ఎన్నో కష్టాలను ఓర్చుకొని నాకు వెన్నుదన్నుగా ఉన్న ధర్మపురి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలకు నా ధన్యవాదాలు’ అని తెలిపారు.

Exit mobile version