NTV Telugu Site icon

Adimulapu Suresh: పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్‌..

Adimulapu Suresh

Adimulapu Suresh

Adimulapu Suresh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడే.. బలి చక్రవర్తి చంద్రబాబును పవన్ తొక్కబోతున్నాడు.. అది బాబు గమనించాలని ఎద్దేవా చేశారు.

Read Also: Counselling to RowdySheeters: ఎన్నికల వేళ బెజవాడలో రౌడీ షీటర్లకి పోలీసుల వార్నింగ్

ఎవరైనా పార్టీ పెడితే అదికారంలోకి రావాలని కోరుకుంటారు.. ప్రజలకు సేవచేయాలని వస్తారు.. పవన్ లా వేరే వాళ్లను ముఖ్యమంత్రిని చేయాలని రారని పేర్కొన్నారు. జగనన్న దెబ్బకు పవన్‌కు భయమేస్తుంది అందుకే అతనికి కేటాయించిన 24 స్థానాలలో తను ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించలేదన్నారు. చట్ట సభలలో అడుగు పెట్టే రాత పవన్‌కి లేదన్నారు. టీడీపీ-జనసేన పొత్తు ఉదయించే పొత్తు కాదు.. అస్తమించే పొత్తు అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ పొత్తును ప్రజలు అంగీకరించటం లేదన్నారు.