టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనలో ఉండగా దళితులు నిరసనకు దిగారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో దళితులు నిరసనలు తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి జిల్లాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు దళిత ద్రోహి. చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదని దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ఉద్ఘాటించారు. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు.
Read Also: RJD MLA: 2019 పుల్వామా దాడి తరహాలోనే పూంచ్ దాడి.. ఆర్జేడీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు మంత్రి సురేష్…చంద్రబాబు కాన్వాయ్ మంత్రి సురేష్ కార్యాలయం దాటే సమయంలో రాళ్లు విసిరారు ఆకతాయిలు..ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి సురేష్ కార్యాలయం లోనే ప్రాథమిక చికిత్స అందించారు వైద్యులు..ఇరువర్గాలను కట్టడి చేసిన పోలీసులు.. కాన్వాయ్ దాటి వెళ్ళటంతో ఊపిరి పీల్చుకుంది యంత్రాంగం..యర్రగొండపాలెం క్యాంప్ కార్యాలయం దాడి ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలిపాం..దళితులను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పాలన్నాం..కాన్వాయ్ దాటి వెళ్ళే సమయంలో ఉద్దేశ్య పూరితంగా దాడి చేశారు..చంద్రబాబు సిగ్నల్ ఇచ్చిన తర్వాతే రాళ్ల దాడి జరిగింది..చంద్రబాబు వేలు చూపించి రెచ్చగొట్టిన తర్వాతే దాడి చేశారని మంత్రి సురేష్ అన్నారు. ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి..కొంతమందికి రక్తస్రావం ఎక్కువగా కావటంతో చికిత్స అందిస్తున్నాం..దళితుల మనోభావాలను కించ పరిచాలని చూస్తే ప్రాణత్యాగానికైనా సిద్దం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఏమన్నారంటే?
ఎర్రగొండపాలెంలో మంత్రి సురేష్ ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.ఎర్రగొండపాలెంలో అసైన్డ్ భూములు మంత్రి సురేష్, అతని బంధువు ఆక్రమించారు.మంత్రి ఆక్రమించిన భూములపై ట్రిబునల్ వేసి పేదలకు తిరిగి అప్పగిస్తా.ఎర్రగొండపాలెంలో తాగు నీటి సమస్య ఉంది…ప్రతి గ్రామానికీ కృష్ణా నీళ్లు తీసుకువస్తాం.రాష్ట్రంలో దళితుల్ని చంపేస్తుంటే మంత్రి సురేష్ ఎక్కడ దాక్కున్నాడు.దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ. ఎరిక్షన్ బాబు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాడు.ఆదిమూలపు సురేష్ కి ఎర్రగొండపాలెంతో తిరిగి పోటీ చేసే ధైర్యం ఉందా.ఆదిమూలపు సురేష్ ని శాశ్వతంగా ఇంటికి పంపాలి.జగన్ ని వదిలించుకుంటే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ లేదు.
Read Also: Satya Pal Malik: జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ కు సీబీఐ పిలుపు.. ఆ కేసులో సత్యపాల్ విచారణ!