Adimulapu Suresh: ప్రకాశం జిల్లా మార్కాపురం సామాజిక, సాధికార యాత్రలో మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అందరికీ సమానత్వం రావటమే సాధికారత అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ చట్టసభలలో బీసీ, ఎస్సీ, మైనారిటీలకు ప్రాధాన్యత రావడమన్నారు. ఏపీలో గతంలో చూడని చదువులు అందుతున్నాయంటే సీఎం జగన్ కారణమని మంత్రి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ భావిస్తున్నారన్నారు.
Also Read: AP CM Jagan Tour: రేపు పుట్టపర్తి పర్యటనకు సీఎం జగన్.. రైతుల ఖాతాల్లో నగదు జమ
పేద ప్రజల బ్రతుకులు మార్చే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వైసీపీ వైపే ఉన్నారన్నారు. సీఎంగా జగనన్నకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేదల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు పొందాలని టీడీపీ వాళ్లు చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడే చంద్రబాబు.. కోర్టులను మోసం చేసే చంద్రబాబుకు ప్రజలను మోసం చేయటం వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు. జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.