Site icon NTV Telugu

Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో గత తీర్పు రిపీట్.. వారిపై విశ్వాసం లేదు..

Minister Adimulapu Suresh

Minister Adimulapu Suresh

Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల తీర్పు రిపీట్‌ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.. టీడీపీ, చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారన్న ఆయన.. మరోసారి టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు.. ఇక, సొంత ఇంటి కల నేర వెరుస్తున్న ప్రభుత్వం వైసీపీది.. 50 వేల మందికి పట్టాలు అమరావతిలో ఇవ్వాలని సంకల్పించామన్నారు.. సుప్రీం కోర్టు కూడా ఆర్ 5 జోన్ లో జరుగుతున్నది అభివృద్దే అనీ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు. చట్టాలను ఉల్లంఘించడంలేదన్న ఆయన.. కానీ, సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని టీడీపీ పిటిషన్‌ వేయడం దారుణం అన్నారు.. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారుఉ.. చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

మరోవైపు మాజీ మంత్రి బాలినేని విషయలో ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు మంత్రి సురేష్‌.. మొన్నటి మార్కాపురం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటనలో రాకూడని దారిలో వెళ్లడం వల్ల అది జరిగిందన్నారు.. నేను కూడా అటుగా వెళ్ళానని తెలిపారు. అయితే, బాలినేనిని పోలీసులు అడుకున్నది వాస్తవం అన్నారు. బాలినేని విషయంలో ఎన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Exit mobile version