NTV Telugu Site icon

Audimulapu Suresh: భవిష్యత్ లో సరికొత్త విశాఖను చూడబోతున్నాం..

Adhimulapu

Adhimulapu

విశాఖ పట్నంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ అధ్యక్షతన VMRDAలో జరిగిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. సమీప భవిష్యత్ లో సరికొత్త విశాఖను చూడబోతున్నాం అని ఆయన పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేశాం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. మెట్రో ట్రైన్ కు సంబంధించిన ప్రతిపాదనలు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయ్ అని ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.

Read Also: Mansion 24 Web Series : ఓటీటీ లోకి వచ్చేసిన మాన్షన్ 24 వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న విశాఖను అత్యంత నివాసయోగ సిటీగా మార్చడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం అంటూ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. మూడు జిల్లాల్లో విస్తరించిన మహా విశాఖ నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రాజెక్టులపై సమీక్షించాం.. మెట్రో సహా అన్ని ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్దిపై జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేయనున్నారు అని ఆయన తెలిపారు.

Read Also: Ram Charan : రామ్ చరణ్ కోసం ఇండియా వచ్చిన జపాన్ లేడీ ఫ్యాన్స్.. ఫోటోలు వైరల్..

ఏపీలో అన్ని ప్రాంతాలను సమన్యాయం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విశాఖ నుంచి తొందరలోనే పరిపాలన కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. విశాఖలో ఇప్పటికే అనేక పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే సీఎం జగన్ తోనే సాధ్యమవుతుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.