Mini Cooper S Convertible: మినీ ఇండియా సంస్థ భారత పోర్ట్‌ఫోలియోను విస్తరించుకొనే భాగంలో కొత్తగా Cooper S Convertible మోడల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు, ప్రత్యేక ఓపెన్ టాప్ అనుభవం ఈ కారును ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ కొత్త Mini Cooper S Convertibleలో 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు.
ఇది 204 hp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు. ఈ మోడల్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. ఇది 0 నుంచి 100 kmph వేగం చేరడానికి కేవలం 6.9 సెకన్లు పడుతుంది. ఇది 237 kmph గరిష్ట వేగం వద్ద లిమిట్ చేశారు. కంపెనీ ప్రకారం ఈ కన్వర్టిబుల్ 16.82 kmpl మైలేజ్ ఇస్తుంది.
Subramaniaswamy deepam row: మద్రాస్ హైకోర్టు జడ్జికి మాజీల మద్దతు.. ఇండియా కూటమిపై విమర్శలు..
ముందు భాగంలో సిగ్నేచర్ సర్క్యులర్ LED హెడ్‌లైట్లు, వాటికి సరిపోయే DRLs ప్రత్యేక ఆకర్షణ. ఆక్టాగనల్ గ్రిల్, బ్లాంక్ ఆఫ్ సెంటర్ ట్రిమ్, బ్లాక్ హోరిజాంటల్ లైన్స్, ప్రామినెంట్ ‘S’ బ్యాడ్జ్, పెద్ద ఎయిర్ ఇంటేక్స్ కారుకు స్పోర్టీ లుక్ అందిస్తాయి. హార్డ్ టాప్ మోడల్‌కు సమానమైన ప్రొపోర్షన్లు ఉన్నప్పటికీ, ప్రధాన హైలైట్‌గా 18 సెకన్లలో తెరవబడే లేదా మూయబడే ఎలక్ట్రిక్ రూఫ్‌ను అందించారు. అలాగే ఇది 17 అంచుల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, సైడ్లపై బ్లాక్ క్లాడింగ్, వీల్ ఆర్చుల చుట్టూ రగ్గ్డ్ డిజైన్ కారు లుక్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.
Mini Cooper S Convertible అంతర్గత భాగంలో సర్క్యులర్ డిజైన్ భాషను కొనసాగించింది. డ్యూయల్ టోన్ మినిమలిస్ట్ ఇంటీరియర్, పిల్ షేప్ ఎయిర్ వెంట్స్, సస్టైనబుల్ మెటీరియల్స్‌తో రూపొందించిన కస్టమైజ్ చేయగలిగే డాష్ బోర్డ్ లభిస్తాయి. బ్లాక్, బేజ్ రంగుల కలయిక ఇంటీరియర్‌కు ఆధునికమైన ఫీలింగ్ ఇస్తుంది. ఇది 9.4 అంగుళాల Android ఆధారిత OLED టచ్‌స్క్రీన్ ఉంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రెండింటికీ ఉపయోగపడుతుంది. హెడ్-అప్ డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంది.
అలాగే ఇందులో పవర్డ్ సీట్ల సదుపాయం, Harman Kardon ఆడియో సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, అంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఓపెన్ టాప్ కారు రూ. 58.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తుంది. బుకింగ్‌లు ఇప్పటికే మొదలవ్వగా.. డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. మొత్తంగా Mini Cooper S Convertible భారత లగ్జరీ హ్యాచ్‌బ్యాక్, కన్వర్టిబుల్ సెగ్మెంట్‌లో కొత్త స్పోర్టీ, స్టైలిష్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
Check out the new 2025 MINI Cooper S Convertible in Icy Sunshine Blue! pic.twitter.com/78WOMd24nW
— MINI of Fairfield County (@MINIofFC) March 31, 2025
