Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Minapa Barfi Healthy Protein Sweet Recipe

Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

Published Date :April 21, 2026 , 4:35 pm
By Gogikar Sai Krishna
  • పప్పుల పవర్
  • సింపుల్ రెసిపీ
  • బెల్లం మజా
  • హెల్త్ బెనిఫిట్స్
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minapa Barfi Recipe in Telugu : మారుతున్న కాలంలో మనం రకరకాల ఆధునిక స్వీట్లకు అలవాటు పడిపోతున్నాం. కానీ, మన పూర్వీకులు అందించిన పప్పు దినుసులతో చేసే వంటకాల్లో ఉండే బలం మరెందులోనూ ఉండదు. ముఖ్యంగా మహిళలకు, ఎదుగుతున్న పిల్లలకు ‘మినము’ అందించే శక్తి వెలకట్టలేనిది. సాధారణంగా మినప్పప్పుతో సున్నుండలు చేస్తారు, అయితే అవి గొంతుకు అడ్డం పడతాయనో లేదా పొడిపొడిగా ఉంటాయనో చాలామంది పిల్లలు తినడానికి మారాం చేస్తారు. అలాంటి వారి కోసం అశ్విని కిచెన్ వారు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ‘మినప బర్ఫీ’ని పరిచయం చేశారు. కేవలం పది నిమిషాల శ్రమతో, ఇంట్లోనే లభించే వస్తువులతో ఈ అత్యంత బలవర్ధకమైన స్వీట్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Prakash Raj: నీ ద్వేషం ఎవరిపై? ప్రకాష్ రాజ్’పై నటుడు సంచలనం

కావలసిన పదార్థాలు:

  • మినపగుళ్ళు: 1 కప్పు
  • పెసరపప్పు (పొట్టు లేనిది): ½ కప్పు
  • బెల్లం: 2 కప్పులు (ఆరోగ్యం కోసం పంచదారకు బదులు)
  • నీళ్లు: 1 కప్పు
  • నెయ్యి: 4 నుండి 5 స్పూన్లు
  • పాలు: 1 కప్పు
  • యాలకుల పొడి: ½ స్పూన్
  • ఉప్పు: ఒక చిటికెడు (రుచిని పెంచడానికి)

తయారీ విధానం:
1. పప్పుల తయారీ:
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు శుభ్రం చేసిన మినపగుళ్ళను వేసి సిమ్ లో పెట్టుకుని దోరగా వేయించాలి. మినపగుళ్ళు సుమారు 50 శాతం వేగిన తర్వాత, అందులో అర కప్పు పెసరపప్పును కూడా కలపాలి. ఈ రెండింటినీ చక్కని వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసి, ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

2. బెల్లం పాకం సిద్ధం చేయడం:
మరో పాన్ లో రెండు కప్పుల బెల్లం , ఒక కప్పు నీరు పోసి కరిగించుకోవాలి. ఇది తీగ పాకం రానవసరం లేదు, బెల్లం కరిగి కాస్త నురగ వస్తూ చిక్కబడితే సరిపోతుంది. ఈ దశలో మూడు స్పూన్ల నెయ్యిని అందులో వేసి కలిపి, పాకాన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లార్చుకోవాలి.

Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

3. గ్రైండింగ్ , మిక్సింగ్:
చల్లారిన మినప-పెసర పప్పుల మిమాన్ని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయాలి. దీనిని మరీ మెత్తగా కాకుండా, కొంచెం రవ్వలా (పలుకులుగా) ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు చల్లారిన బెల్లం పాకంలో ఈ పొడిని వేసి ఎక్కడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి.

4. ఉడికించే విధానం:
పిండి కలిసిన మిశ్రమాన్ని తిరిగి స్టవ్ మీద పెట్టి సిమ్ లో ఉడికించాలి. ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఒక కప్పు పాలు పోసి బాగా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు యాలకుల పొడి, చిటికెడు ఉప్పు , మరో స్పూన్ నెయ్యి వేయాలి. మిశ్రమం పాన్ నుండి విడిపోతూ, నెయ్యిని బయటకు వదులుతున్నప్పుడు (సెపరేట్ అవుతున్నప్పుడు) స్టవ్ ఆఫ్ చేయాలి.

5. ఆకృతులు ఇవ్వడం:
ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన చిన్న చిన్న బౌల్స్ లో వేసి ప్రెస్ చేయడం ద్వారా అందమైన షేప్స్ ఇవ్వవచ్చు. లేదా బట్టర్ పేపర్ పై వేసి రోల్ లా చుట్టి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఎంతో మృదువైన, రుచికరమైన మినప బర్ఫీ సిద్ధం!

ఎందుకు తినాలి?

  • ఎముకల పుష్టికి: మినము , పాలు కలవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది.
  • మంచి జీర్ణక్రియ: బెల్లం వాడటం వల్ల రక్తహీనత తగ్గడమే కాకుండా జీర్ణక్రియకు మేలు జరుగుతుంది.
  • తక్షణ శక్తి: నెయ్యి , పప్పుల్లోని ప్రోటీన్ల వల్ల నీరసం తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది.

ఈ స్వీట్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే నాలుగు రోజుల పాటు తాజాగా ఉంటుంది. రోజుకు ఒక బర్ఫీ తింటే పిల్లలు చాలా బలంగా, ఆరోగ్యంగా తయారవుతారు. మీరూ తప్పకుండా ప్రయత్నించండి..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Energy Foods
  • Healthy Sweets
  • Homemade Sweets
  • Kids Nutrition
  • Minapa Barfi

తాజావార్తలు

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • PM Modi: వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన..!

  • Jasprit Bumrah IPL Record: 276 టీ20 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!

  • Canada Bill C-12: ఇండియన్స్ టార్గెట్‌గా కెనడా కొత్త రూల్స్? ఇక అంతే సంగతులు!

  • Mega El Nino: 149 ఏళ్ల తర్వాత ‘‘మెగా ఎల్ నినో’’.. భారత్‌లో కరువు తప్పదా..?

ట్రెండింగ్‌

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

  • 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions