రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ కుప్ప కూలిపోయింది. ఇది ఓ హాస్టల్ సమీపంలో కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.
తేజస్ ఫైటర్ జెట్ శిక్షణ విమానం. మంగళవారం శిక్షణలో భాగంగా ప్రాక్టీస్ చేస్తుండగా జైసల్మేర్ సమీపంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఇది విద్యార్థుల వసతి గృహం సమీపంలో కూలిపోయింది. విద్యార్థులకు ఏమైనా జరిగిందా? అన్న విషయం మాత్రం తెలియలేదు. ప్రమాద సమయంలో మాత్రం పైలట్ చాకచక్యంగా బయటపడ్డాడు.
ఇదిలా ఉంటే తేజస్ కూలడం ఇదే మొదటిసారి. తేజస్ 2016లో భారత వైమానిక దళంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్రాష్ ఇప్పుడే ఇదే తొలి .
ఈ ప్రమాదంపై వైమానిక దళం స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. పైలట్ సురక్షితంగా ఉన్నట్లు ఈ మేరకు ట్వీట్ చేసింది. భారత వైమానిక దళానికి చెందిన ఒక తేజస్ విమానం జైసల్మేర్ దగ్గర ఈరోజు ఆపరేషన్ శిక్షణలో ప్రమాదానికి గురైందని తెలిపింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసినట్లు భారత వైమానిక దళం తెలిపింది. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్‌లో పేర్కొంది.
ప్రమాదం జరగగానే స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వగానే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. హాస్టల్ సమీపంలో పడడంతో విద్యార్థులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
One Tejas aircraft of the Indian Air Force met with an accident at Jaisalmer, today during an operational training sortie. The pilot ejected safely.
A Court of Inquiry has been constituted to find out the cause of the accident.— Indian Air Force (@IAF_MCC) March 12, 2024
#WATCH | Rajasthan | A Light Combat Aircraft (LCA) Tejas of the Indian Air Force crashed near Jaisalmer today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause of the accident. pic.twitter.com/3JZf15Q8eZ
— ANI (@ANI) March 12, 2024