Site icon NTV Telugu

Andhra Pradesh: రాష్ట్రంలోని 2 జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి

Earthquake

Earthquake

Andhra Pradesh: ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాలలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లాలోని దొరవారిసత్రంలో భూమి కంపించింది. రెండు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఈ భూప్రకంపనలపై ఆరా తీస్తున్నారు.

Read Also: Yarlagadda Venkata Rao: గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతా..

నాయుడుపేటలోని పిచ్చిరెడ్డి తోపు, మంగపతినగర్ ప్రాంతాల్లో రాత్రి 8.43 గంటల ప్రాంతంలో 5 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.9 పాయింట్లుగా భూకంప తీవ్రత నమోదైంది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే 08772236007 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version