ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాలలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం మధ్యాహ్నం భూమి కంపించింది. భూ ప్రకంపనల కారణంగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.