Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Migraine in Women: గత కొంతకాలంగా చాలామంది మహిళలు మైగ్రేన్ సమస్యతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదు. ఇది తరచుగా వస్తూ.. తల నొప్పి ఎక్కవుగా తీవ్రంగా ఉంటుంది. ఇది సాధారణ తలనొప్పికి భిన్నంగా, తరచుగా తలలోని ఒక భాగంలో కొట్టుకుంటున్నట్లుగా నొప్పిని కలిగిస్తుంది. మైగ్రేన్ సమయంలో వాంతులు, మలబద్ధకం, వెలుతురు, శబ్దానికి అసహనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి తల తిరగడం, బలహీనత కూడా ఉండడం చూడవచ్చు.
Gold Rates: యుద్ధం వేళ మగువలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు
Also Read
- Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
- Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
- Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
- Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ 'మనీ రూల్స్'.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక ఒత్తిడి, సరైన నిద్రలేమి ఉన్న మహిళల్లో మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హార్మోన్ల మార్పులు కూడా దీనికి ప్రధాన కారణం. పీరియడ్స్, గర్భధారణ లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మైగ్రేన్ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా తీవ్రమవుతుంది. ఇవే కాదు మైగ్రేన్ కు మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఆందోళన చెందడం, మానసిక ఒత్తిడి ఈ సమస్యను పెంచుతాయి. అలాగే రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, సరైన విశ్రాంతి లేకపోవడం కూడా మైగ్రేన్‌కు దారి తీస్తాయి. కొంతమందిలో ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం, గట్టిగా శబ్దం వినడం కూడా మైగ్రేన్ ను ట్రిగర్ చేస్తాయి.
అలాగే ఆహారపు అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువసేపు ఆకలిగా ఉండటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన మైగ్రేన్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఈ అన్ని కారణాలు కలిపి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. మైగ్రేన్‌ను నియంత్రించడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ ఒక మంచి జీవనశైలిని పాటించడం, సమయానికి నిద్రపోతూ.. తగినంత నిద్ర తీసుకోవడం ముఖ్యము. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం చేయడం మంచిది. ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉండకుండా మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.
Jowar Halwa Recipe: స్వీట్ క్రేవింగ్స్‌కు బెస్ట్ ఆప్షన్ ‘జొన్నపిండి హల్వా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ఇంకా ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు. రోజుకు తగినంత నీరు తాగడం కూడా అవసరం. ఈ చిన్న చిన్న అలవాట్లు మైగ్రేన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే మైగ్రేన్ తరచుగా వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. మైగ్రేన్‌ను ప్రేరేపించే కారణాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీరాన్ని చురుకుగా ఉంచడం అవసరం.
తాజావార్తలు
-
Bank of Baroda Data Leak: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా లీక్? ప్రమాదంలో కోట్లాది కస్టమర్ల సమాచారం!
-
2020 Delhi Riots Case: తాహిర్ హుస్సేన్‌కు ఉరిశిక్ష విధించాలి.. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు..
-
US: ఫుడ్ ఫెస్టివల్లో కాల్పులు.. ముగ్గురు మృతి
-
Salman Khan: సల్మాన్‌కు ఊరట.. ‘బ్లాక్ బక్’ టీజర్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం!
-
CM Chandrababu: విద్యార్థిని శివాని మృతి తీవ్ర విచారం కలిగించింది.. యువత ధైర్యంగా నిలబడాలి!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!