Indian Elections: భారత దేశంలో ఎన్నికల హాడావుడి కొనసాగుతుంది. ఈ ఎన్నికలను బీజేపీ సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉందని మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మెక్రోసాఫ్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా.. సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రకటించింది. ఏఐ ఆధారిత కాంటెంట్‌తో అమెరికా, దక్షిణ కొరియా దేశాల ఎన్నికల పైన కూడా దీని ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.
Read Also: Suryakumar Yadav: ముంబై జట్టులోకి సూర్య భాయ్ ఎంట్రీ.. ప్రత్యర్థులకు దబిడిదిబిడే..
కాగా, ఎన్నికల వేళ ఏఐ ఆధారిత కాంటెంట్‌ను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం చేయనుంది అని మెక్రోసాఫ్ట్ తెలిపింది. కీలకమైన ఎన్నికలు తమకు అనుకూలంగా ఉండే రీతిలో ఆ ప్రచారం జరిగే ఛాన్స్ ఉంది.. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు, ఆడియో రూపంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొనింది. అలాగే, చైనా పొజిషన్‌ను సపోర్టు చేసే రీతిలో వాటిని రూపొందించనున్నారు అని తెలిపింది.
Read Also: The Goat Life :అవార్డు సినిమా అన్నారు కదరా.. ఈ రేంజ్ కలెక్షన్సా?
అయితే, ఇలాంటి ఎత్తుగడలతో లోక్ సభ ఎన్నికల్లో ప్రభావం చూపడం తక్కువగానే ఉంటుందనే అభిప్రాయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యక్తం చేసింది. అయితే, చైనా ఇప్పటికే ఈ ఏడాది జనవరి నెలలో తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేయించిందని తెలిపింది. ఈ విధంగా విదేశీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్‌ను వినియోగించడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చింది.
https://twitter.com/Everything65687/status/1776251865820221577