‘Michael’ Trailer Out: మళ్లీ తిరిగొచ్చిన ‘కింగ్ ఆఫ్ పాప్’.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్ అదుర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత ప్రపంచాన్ని దాదాపు మూడు దశాబ్దాల పాటు తన డ్యాన్స్‌తో, పాటలతో ఊపేసిన ఏకైక వ్యక్తి మైఖేల్ జాక్సన్. ఆయన చనిపోయి 25 ఏళ్లు దాటినా, నేటికీ ఆ మేజిక్ తగ్గలేదు. ఇప్పుడు ఆ లెజెండ్ ప్రయాణాన్ని వెండితెరపై చూసే సమయం వచ్చేసింది. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో రూపొందుతున్న ‘మైఖేల్’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Also Read : Rakul Preet Singh: డబ్బులిచ్చి మరీ బురద చల్లుతున్నారు.. పీఆర్ పై నిప్పులు చెరిగిన రకుల్
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇక ఈ ట్రైలర్ కనుక చూస్తే కేవలం మైఖేల్ జాక్సన్ సాధించిన విజయాలను మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని పోరాటాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించింది. ముఖ్యంగా టీనేజ్ వయసులో తన తండ్రితో ఆయనకున్న విభేదాలు, పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న ఒత్తిడిని చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఒక సామాన్య బాలుడు గ్లోబల్ ఐకాన్‌గా ఎలా ఎదిగాడనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ఇక ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత తమ్ముడి కొడుకు జాఫర్ జాక్సన్ (Jaafar Jackson) పోషిస్తుండటం విశేషం. ట్రైలర్లో జాఫర్ లుక్స్ చూస్తుంటే.. మళ్లీ మైఖేల్ జాక్సన్ తిరిగి వచ్చాడా? అనే రేంజ్లో ఉన్నాడు. ఆయన డ్యాన్స్ మూవ్స్, బాడీ లాంగ్వేజ్, ఆ వాయిస్.. అచ్చు గుద్దినట్లు మైఖేల్ లాగే ఉన్నాయి. ఫ్యాన్స్‌కు ఇది కచ్చితంగా ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను ఇస్తుంది.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తుంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద $1 బిలియన్ (దాదాపు రూ. 8,300 కోట్లు) మార్కును సునాయాసంగా దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంగీత ప్రియులకు, మైఖేల్ జాక్సన్ అభిమానులకు ఇది ఒక ఎమోషనల్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు.
His story begins.
The official trailer for MICHAEL – in theaters and IMAX April 24. pic.twitter.com/toEpqkjUh3
— lionsgate (@Lionsgate) February 2, 2026
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..