MI vs LSG: రెచ్చిపోయిన ముంబై బ్యాటర్లు.. మరో విజయం దక్కేనా?
- హాఫ్ సెంచరీలతో ఆదుకున్న ర్యాన్ రికెల్టన్, సూర్య కుమార్ యాదవ్.
- నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్.
- లక్నో ముందు 216 పరుగుల భారీ టార్గెట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI vs LSG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. ముంబై మొదట బ్యాటింగ్ చేపట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగుల భారీ స్కోరును చేసినది. ఇక ఈ ఇన్నింగ్స్ లో ర్యాన్ రికెల్టన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 58 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 54 పరుగులు, చివరిలో నామన్ ధీర్ 11 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సులతో 25 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. ఇక వీరితోపాటు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలో రోహిత్ శర్మ (12) దూకుడుగా ఆడదానికి ప్రయత్నించి మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (29), తిలక్ వర్మ (6) హార్దిక్ పాండ్యా (5) త్వరగా ఔట్ కావడంతో ముంబై కొంత ఒత్తిడిలో పడింది. అయితే, నమన్ ధీర్, కార్బిన్ బాష్ చివరి ఓవర్లలో వేగంగా పరుగులు జోడించడంతో జట్టు భారీ స్కోరును సాధించింది. మొత్తం మీద, ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ ముందు గట్టి లక్ష్యాన్ని ఉంచింది.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, రవి బిష్ణోయ్ లు చెరో వికెట్ సాధించారు. చూడాలి మరి లక్నో ఈ భారీ లక్షాన్ని ఛేదించి విజయాన్ని సాధిస్తుందో.. లేక, ముంబై వరుస విజయాల పరంపరను కొనసాగిస్తుందో.
Also Read
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!