NTV Telugu Site icon

Metro Rail: మెట్రోలో రెస్టారెంట్.. ఇకపై తినడం.. ప్రయాణం చేయడం..!

13

13

దేశంలోని అనేక ప్రముఖ నగరాలలో ఇప్పటికే మెట్రో రైలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకీ నగరాల్లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణలో భాగంగా వేగవంతమైన ప్రయాణాల కోసం నగరాలలో మెట్రో రైలు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. ఇదే క్రమంలోనే రోజురోజుకి కొత్త టెక్నాలజీ, అలాగే ఆకర్షణ ఏమైనా సదుపాయాలతో మెట్రో ట్రైన్స్ రూపొందుతున్నాయి. నగరాలలో ఇప్పటికే ఉన్న మార్గాలతో పాటు మరికొన్ని రైలు మార్గాలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకువస్తూ ప్రజలకు మెట్రో రైళ్ల సేవలను దగ్గరకు చేరుస్తుంది. దీనివల్ల సుఖవంతమైన ప్రయాణాన్ని నగరవాసులు అనుభూతి చెందుతారు. ఇకపోతే తాజాగా మెట్రో రైలు అధికారులు మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రజల కోసం తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..

Also read: Man Kills Daughter: చదువుకోవడం లేదని.. 17 ఏళ్ల కుమార్తెపై దారుణం..

నగరవాసులకు మెట్రో రైలులో ప్రయాణం చేసిన సమయంలోనే భోజనం చేసే సదుపాయాన్ని అధికారులు కల్పించబోతున్నారు. వీటికి సంబంధించి మెట్రో రైల్ లోనే రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇది మన హైదరాబాద్ నగరం మెట్రోలైతే కాదు. ఇది ఢిల్లీ దగ్గరలోని నోయిడా మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ప్రాజెక్ట్. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో దీన్ని ఏప్రిల్ 20వ తారీకున ప్రారంభిస్తున్నట్లు నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తాజాగా తెలిపారు.

Also read: Pakistan: “అక్కడికి వెళ్లి ఉగ్రవాదుల్ని హతమారుస్తాం”.. రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన పాకిస్తాన్..

నోయిడా సెక్టార్ 137 లోని మెట్రో స్టేషన్ లోని కోచ్‌లో ఈ కొత్త మెట్రో రైల్వే రెస్టారెంట్ సౌకర్యం అతి త్వరలో రానున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రయాణికులు ఉదయం 11:30 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉన్న సమయంలో భోజనం చేయొచ్చని అధికారులు తెలుపుతున్నారు. ఇందుకోసం మెట్రో కోచ్ లలో ప్రత్యేకమైన డైనింగ్ కాన్సెప్ట్ ను అధికారులు అభివృద్ధి చేశారు. ఇందుకు గాను సీట్లతో పాటు టేబుల్స్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రెస్టారెంట్ల భాగంగా ఒకేసారి వందమంది కూర్చుని తినేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బయటనుంచి కూడా తమకి ఇష్టమైన ఆహారము, డ్రింక్స్ ఆర్డర్ చేసుకొని డైనింగ్ కోచ్ లలో ఆస్వాదించవచ్చని వారు తెలిపారు.