NTV Telugu Site icon

Weather Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Heavy Rain

Heavy Rain

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు. రాష్ట్రంలోని ఈశాన్య మరియు తూర్పు జిల్లాలు, చుట్టుపక్కల కొన్ని జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు.

తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే నాలుగైదు రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని.. రానున్న నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Janvikapoor : పురివిప్పిన నెమలిలా జాన్వీ ఎంత అందంగా డ్యాన్స్ చేసిందో చూశారా?

ఇక ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Hyd -Vijayawada Highway : హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఇవే..!

ఇదిలా ఉంటే గురువారం హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. డ్రైనేజీలు, నాలాలు ఏకమైపోయాయి. పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు నరకం చూశారు. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది పరిస్థితుల్ని చక్కదిద్దారు. మరోసారి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

Show comments