NTV Telugu Site icon

Weather Update: రాష్ట్రాలకు చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..!

Weather Update

Weather Update

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండవేడిమి, తీవ్ర వడగాల్పుల మధ్య జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో.. వాతావరణ శాఖ ఒక ఉపశమనం వార్త చెప్పింది. IMD ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణ మార్పులు మారబోతున్నాయి. ఏప్రిల్ 26 నుంచి 28 వరకు వాయువ్య భారతదేశంలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఈశాన్య భారతదేశంలో కూడా ఎండల బారీ నుండి ప్రజలు కూడా ఉపశమనం పొందనున్నారు. ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఈశాన్య భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం.. రాబోయే కొద్ది రోజుల పాటు తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని తెలిపింది.

Kalpana Soren: ఎన్నికల బరిలోకి హేమంత్ సోరెన్ సతీమణి.. ఎక్కడ్నుంచంటే..!

ఏప్రిల్ 26, 27 తేదీల్లో జమ్మూకశ్మీర్, లడఖ్, పంజాబ్, హర్యానాలలో పలుచోట్ల వడగళ్ల వాన, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో, ఏప్రిల్ 27న బలమైన ఉరుములతో కూడిన హిమాచల్ ప్రదేశ్‌లో చాలా చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లోని చాలా చోట్ల ఒడిశాలోని కొన్ని చోట్ల హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు ఉండవచ్చని IMD తన తాజా నవీకరణలో తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. ఏప్రిల్ 25 నుండి ఏప్రిల్ 29 వరకు తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, కొంకణ్, గోవా, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటకలో హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

Odisha: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడంటే.?

ఏప్రిల్ 26 నుండి 28 వరకు వాయువ్య భారతదేశం మరియు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.