NTV Telugu Site icon

Meta AI: ఆత్మహత్యకుమందు యువతి సోషల్ మీడియాలో పోస్ట్.. పోలీసులకు ఫోన్ చేసి కాపాడిన మెటా ఏఐ

Up News

Up News

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెటా (ఫేస్‌బుక్) ఏఐ కారణంగా 21 ఏళ్ల యువతి ప్రాణం రక్షించబడింది. ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతకు ముందు కారణాలను ఓ వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోస్ట్ వైరల్ అయ్యింది. స్పందించిన మెటా ఏఐ (Meta AI) వెంటనే యూపీ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే యువతి ఆచూకీని గుర్తించి ఆమె ఇంటికి చేరుకుని ప్రాణాలను కాపాడారు.

READ MORE: Special Officers For Flood Affected Areas: వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక అధికారులు.. విజయవాడలో వీరిని సంప్రదించండి..

శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ యువతి ఉరి వేసుకుంటున్నట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలయంలోని సోషల్ మీడియా సెంటర్‌లో మెటా ఏఐకి సమాచారం అందిందని ఏసీపీ మోహన్‌లాల్‌గంజ్ రజనీష్ వర్మ తెలిపారు. శనివారం ఇంట్లో మెడకు తాడు బిగించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఆత్మహత్య గురించి మాట్లాడింది. కొద్దిసేపటికే ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో మెటా నుంచి అలర్ట్ అందిన వెంటనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంబంధిత పోలీస్ స్టేషన్‌ను అప్రమత్తం చేశారు. కొద్దిసేపటికే మహిళ గ్రామాన్ని పోలీసులు గుర్తించారు. మహిళా పోలీసు అధికారితో పాటు పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మహిళతో మాట్లాడిన తర్వాత ఆమెను గది నుంచి బయటకు తీసుకెళ్లారు.

READ MORE: Firing On Famous Singer : ప్రముఖ సింగర్ పై కాల్పులు.. గతంలో సల్మాన్ ఖాన్ పై ఫైరింగ్ చేసిన గ్యాంగే!

వాస్తవానికి.. తన భర్త వదిలివేయడం వల్ల యువతి కలత చెందింది. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఇదే. యువతి ఆత్మహత్యకు యత్నిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదని ఏసీపీ తెలిపారు. మరో ప్రాంతంలో ఉంటున్న యువకుడితో బాలికకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నాలుగు నెలల క్రితం వారిద్దరూ ఆర్యసమాజ్ ఆలయంలో పెళ్లి చేసుకుని భార్యాభర్తలలా సహజీవనం ప్రారంభించారు. ఈ వివాహం చట్టబద్ధంగా చెల్లదు కాబట్టి, యువకుడు ఆమెను విడిచిపెట్టాడు. భర్త వెళ్లిపోవడంతో ఆ యువతి మానసికంగా ఒత్తిడికి గురైందని చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. మహిళా పోలీసులు గంటపాటు ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉంది.

Show comments