Merry Christmas : ఓటీటీలోకి వచ్చేస్తున్న మెర్రీ క్రిస్మస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ మెర్రీ క్రిస్మస్.మంచి అంచనాలతో ఈ మూవీ జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ హైప్తో రిలీజ్ అయిన మెర్రీ క్రిస్మస్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన మెర్రీ క్రిస్మస్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.మెర్రీ క్రిస్మస్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది. మార్చి 8వ తేదీన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్కు తీసుకొచ్చేలా మెర్రీ క్రిస్మస్ మూవీ మేకర్స్ తో ఓటీటీ డీల్ చేసుకుంది నెట్ఫ్లిక్స్. దాని ప్రకారం మార్చి 8వ తేదీన ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు మరియు తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్కు ఈ చిత్రం వచ్చే అవకాశం ఉంది.ఈ మూవీలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటించగా.. అశ్వినీ కల్సేఖర్, ల్యూక్ కెన్నీ, పరి మహేశ్వరి శర్మ, సంజయ్ కపూర్, టినూ ఆనంద్, రాధికా ఆప్టే మరియు గాయత్రీ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ హిందీ, తమిళంలో ద్విభాషా చిత్రంగా రూపొందింది. అంధాధున్ వచ్చిన చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరక్కించారు.మేరీ క్రిస్మస్ చిత్రానికి ప్రీతమ్ మరియు డానియెల్ బీ జార్జ్ సంగీతం అందించారు. టిప్స్ ఫిల్మ్స్, మ్యాచ్బాక్స్ పిక్టర్స్ బ్యానర్లపై రమేశ్ తౌరానీ, జయ తౌరానీ, సంజయ్ రౌట్రే మరియు కేవల్ గార్గ్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.60కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఈ మూవీకి రూ.30 కోట్లలోపే కలెక్షన్లు వచ్చాయి.
Also Read
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
తాజావార్తలు
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
-
Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
-
DC Release Date: గ్యాంగ్స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!