Delhi High Court: ఎవరి వద్దైనా ఒసామా బిన్ లాడెన్ ఫొటో, ఐసిస్ జెండా కనిపించినంత మాత్రాన, ఆ ఒక్క ఆధారంగా మాత్రమే ఉపా చట్టం కింద అతనిపై చర్యలు తీసుకోలేమని, ఢిల్లీ హైకోర్టు ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే ఉపా అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయబడుతుంది. ఎన్ఐఏ వర్సెస్ అమ్మర్ అబ్దుల్ రెహ్మాన్ కేసు విచారణ సందర్భంగా.. ఇలాంటి అంశాలు దొరికినంత మాత్రాన ఎవరినీ టెర్రరిస్టుగా పిలవలేమని కోర్టు పేర్కొంది. దీని ఆధారంగానే ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్రవాద సంస్థతో ఆ వ్యక్తికి సంబంధం ఉందని చెప్పడం సరికాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
Read Also: Pulitzer Prize: పులిట్జర్ బహుమతిని అందుకున్న న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్