Site icon NTV Telugu

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పురుషుల నగ్న నిరసన.. ఎందుకంటే?

Nude Protest

Nude Protest

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన కొంతమంది పురుషులు నగ్నంగా నిరసన తెలిపారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. డజనుకు పైగా నగ్న నిరసనకారులను రాష్ట్ర శాసనసభ వైపు కవాతు చేస్తున్నప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ నాలుగు రోజుల వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

Also Read: Viral Video: చంద్రయాన్-3పై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్

ఉద్యోగాలు పొందేందుకు నకిలీ కుల ధృవీకరణ పత్రాలను ఉపయోగించిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సందేశాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ భవనం వైపు నడుస్తున్న వ్యక్తుల సమూహం వీడియోలో కనిపించింది. అసభ్యకరమైన రీతిలో ప్రదర్శన చేసినందుకు పాండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ సియోని మలుపు దగ్గర ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు రాయ్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ అగర్వాల్ వెల్లడించారు.

Also Read: Mobile Charger: మీ మొబైల్ ఫోన్ కి వేరే ఛార్జర్ తో ఛార్జ్ చేస్తున్నారా..?

నిరసనకారులలో ఒకరు విలేకరులతో మాట్లాడుతూ.. నకిలీ కుల సర్టిఫికేట్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ కమిటీ విచారణ నిర్వహించిందని, 267 మంది ప్రభుత్వ ఉద్యోగులు నకిలీ ఎస్సీ/ఎస్టీ సర్టిఫికెట్లను ఉపయోగించారని తేలిందని, అయితే వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.”గతంలో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరాహారదీక్ష చేశాం.. కానీ మా డిమాండ్ వినలేదు. అందుకే ఇప్పుడు నగ్నంగా నిరసన తెలుపుతున్నాం.. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం ఉన్నవారిని అరెస్ట్‌ చేసి వారు సంపాదించిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకోవాలి” అని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. డిమాండ్లను నెరవేర్చకుంటే మరింత ఉద్ధృతంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.

Exit mobile version