ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన కొంతమంది పురుషులు నగ్నంగా నిరసన తెలిపారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.