Site icon NTV Telugu

Mehbooba Mufti: అణ్వాయుధాలతో కాదు, శాంతికి తొలి అడుగు వేయాలి..!

Mehbooba Mufti

Mehbooba Mufti

Mehbooba Mufti: భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక బాధ్యతాయుత నాయకుడిగా ముందడుగు వేసి, యుద్ధం ఆపేందుకు ప్రయత్నించాలని ఆమె కోరారు. తాజాగా ముఫ్తీ ఎక్స్ ద్వారా చేసిన పోస్ట్‌లో.. ప్రస్తుత సమయంలో భారత్ తన నిజమైన శక్తిని అణ్వాయుధాల్లో కాకుండా, శాంతి సిపి అడుగుయవలిసిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Read Also: IND PAK War: భారత్ ముందు మనం నిలబడలేం.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఆవేదన!

అలాగే భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, జనాభా పరంగా అగ్ర దేశం, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న దేశం కాబట్టి తన మార్గాన్ని ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయించాలని ముఫ్తీ అన్నారు. అంతర్జాతీయ మద్దతు క్రమం తప్పక మారే స్వభావం ఉన్న నేపథ్యంలో భారత్ తన వైఖిరి ద్వారా శాంతిని నెలకొల్పడంలో ముందుండాలన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Read Also: Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తోంది.. భారత్ వెనక్కి తగ్గదు!

ఇంతకుముందు కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్-పాక్ ఘర్షణలో పరిమితమైన పాత్ర మాత్రమే వహిస్తామని పేర్కొనగా, తాజా పరిణామాల దృష్ట్యా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్తాన్ సైన్యాధిపతి అసిం మునీర్‌ను సంప్రదించి ఉద్రిక్తతలు తగ్గించాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే, భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌తో కూడా రూబియో శనివారం మాట్లాడారు. ఇందుకు సంబంధించి అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ప్రకటనలో భారత్, పాకిస్తాన్ ప్రత్యక్ష సంభాషణకు మార్గం వేసుకుని.. అపోహలకు తావు లేకుండా శాంతిని స్థాపించాల్సిన అవసరం ఉందని రూబియో పేర్కొన్నారు. అవసరమైతే అమెరికా మధ్యవర్తిత్వం కూడా అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

Exit mobile version