Meghalaya: భర్త సీఎం.. భార్య ఎమ్మెల్యే.. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నలతో పతికి చుక్కలు చూపించిన అర్ధాంగి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya: భర్త ముఖ్యమంత్రి.. భార్య ఎమ్మెల్యే.. వ్యక్తిగత బంధాలు వదిలేసి ఇద్దరూ అసెంబ్లీలో సమస్యలపై చర్చిస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలాంటి ఘటనే తాజాగా మేఘాలయ అసెంబ్లీలో చోటు చేసుకుంది. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే మెహతాబ్ చండీ అగిటోక్ సంగ్మా (Mehtab Chandee A Sangma), ముఖ్యమంత్రి కాన్రాడ్ కొంగల్ సంగ్మా (Conrad K Sangma) భార్యాభర్తలు. తాజాగా భార్య మెహతాబ్ చండీ పశుసంవర్ధక విద్యాసంస్థల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రిని వివరణ కోరారు. ఓ వైపు కుటుంబ సంబంధాలను పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ ఘటన సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2022లో కేబినెట్ ఆమోదించిన వెటర్నరీ కాలేజ్, రెండు ఫిషరీస్ కాలేజీలు, ఒక డెయిరీ కాలేజ్ పురోగతి ఏ దశలో ఉందని గాంబెగ్రే నియోజకవర్గ ఎమ్మెల్యే మెహతాబ్ ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలోని వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్లలో సిబ్బంది కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంవర్ధక రంగంపై ఆధారపడి జీవనం సాగించే ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ విద్యాసంస్థలు అత్యవసరమని స్పష్టం చేశారు.
READ MORE: Theater vs OTT : ఓటీటీ 8 వారాల నిబంధన అమలు సాధ్యమేనా? బాలీవుడ్ రూల్ ఇక్కడ వర్తిస్తుందా?
Also Read
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ప్రభుత్వ తరఫున భర్త, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమాధానం ఇచ్చారు. పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సిబ్బంది కొరత నిజంగా ఆందోళనకర అంశమేనని అంగీకరిస్తూ, ఖాళీలను త్వరగా భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియామకాలను ప్రాధాన్యంగా తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్) సిద్ధం కావడంలో ఆలస్యం జరిగిన విషయాన్ని సీఎం వివరించారు. భూమి గుర్తింపు, అవసరమైన సిబ్బంది అంచనా వంటి అంశాలు సమయం తీసుకున్నాయని చెప్పారు. రి-భోయ్ జిల్లాలోని కిర్డెంకులై వద్ద వెటర్నరీ కాలేజీ కోసం సుమారు 800 ఎకరాల భూమిని గుర్తించామని, దాని అంచనా వ్యయం రూ.334 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఇందులో 19 విభాగాలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అయితే భారీ ఆర్థిక వ్యయం అవసరమవుతుండటంతో కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రాజెక్టును వేగవంతం చేసే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సభకు హామీ ఇచ్చారు. ఈ చర్చ కాస్త అసెంబ్లీలో ఎంతో ఆసక్తిగా కొనసాగింది.
READ MORE: Sachin-Sehwag-Ganguly: సచిన్–సెహ్వాగ్ ప్రాంక్.. టాయిలెట్‌లో ఉన్న గంగూలీ బలి!
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!