NTV Telugu Site icon

Somu Veerraju : ‘అందరివాడు’కు అరుదైన గౌరవం.. మెగాస్టార్ పై ప్రశంసల వర్షం

Chiru

Chiru

Somu Veerraju : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డు తనను వరించింది. గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలన చిత్రోత్సవం నవంబర్ 20న ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం చిరంజీవికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. చిరంజీవికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. 40సంవత్సరాల సినీ ప్రస్థానంలో చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించారు. తనకు ఈ అవార్డును ప్రకటించడంపై చిరంజీవి స్పందించారు. ఆయనకు అవార్డు లభించడంపై ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. అందరివాడుకి దక్కిన అరుదైన గౌరవమంటూ బీజేపీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ట్వీట్ చేశారు.

ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సాయిధరమ్ తేజ్, నిర్మాత అభిషేక్ అగర్వాల్, బండ్ల గణేష్, రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ ద్వారా చిరంజీవికి అభినందనలు తెలిపారు.