Site icon NTV Telugu

God Father: ‘గాడ్ ఫాదర్’ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తారా?

Godfather First Look Specia

Godfather First Look Specia

God Father: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్(GODFATHER). మలయాళ లూసిఫర్ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. తమన్ సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సత్యదేవ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్, చిరు స్వాగ్ అన్నీ కలిసి గాడ్ ఫాదర్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేశాయి. ఫస్ట్ షో నుంచి మంచి టాక్ స్ప్రెడ్ అవ్వడంతో గాడ్ ఫాదర్ సినిమా మొదటివారంలో మంచి కలెక్షన్స్ ని రాబట్టింది కానీ లాంగ్ రన్ లో ఈ మూవీ కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. రీమేక్ సినిమా అవ్వడం, లూసిఫర్ చూసిన వాళ్లకి గాడ్ ఫాదర్ నచ్చక పోవడం, చిరుది సీరియస్ రోల్ అవ్వడం ఇలా అనేక కారణాల వల్ల గాడ్ ఫాదర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

Read Also: Hero Nani : నీకు ‘మీట్‌ క్యూట్‌’ అంటే తెలుసా? అంటున్న హీరో నాని

గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నా కల్ట్ మెగాస్టార్ అభిమానులు మాత్రం తెరపై చిరు స్వాగ్ ని చూసి ఎంజాయ్ చేశారు. చిరు ఫైట్స్ అండ్ డైలాగ్స్ కి థియేటర్స్ లో విజిల్స్ వేశారు. మెగాస్టార్ వరకూ రిపీట్ వాల్యూ బాగానే ఇచ్చిన గాడ్ ఫాదర్ మూవీ ఇప్పుడు ఒటీటీలో రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్‎లో గాడ్ ఫాదర్ మూవీ నేటి నుంచి స్ట్రీం అవుతోంది(#GODFATHERINNETFLIX). థియేటర్స్ లో చిరు మంచి ఓపెనింగ్స్ ఇచ్చిన మెగా ఫాన్స్, ఇప్పుడు ఈ వీకెండ్ కి ఇంట్లో కూర్చోనే గాడ్ ఫాదర్ ని చూడొచ్చు. మరి ఫస్ట్ రోజు మెగా సినిమాకి ఓటీటీలో ఎన్ని వాచ్ అవర్స్ వస్తాయో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య ప్రతీదీ ఒక రికార్డ్ అవుతుంది కదా.

Exit mobile version