Hero Nani : నీకు ‘మీట్ క్యూట్’ అంటే తెలుసా? అంటున్న హీరో నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Nani : నేచురల్ స్టార్ నాని సమర్పణలో, వాళ్ల అక్క దీప్తి గంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా ఈ ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీస్ నిర్మించారు. నవంబర్ 25 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 5 ఎపిసోడ్‌లుగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో హీరోయిన్స్ అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, హీరోలు అశ్విన్ కుమార్, శివ కందుకూరి, సీనియర్ నటులు సత్యరాజ్, రోహిణి ముఖ్యపాత్రలు పోషించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. నాని వాయిస్ ఓవర్ తో.. ‘నీకు మీట్ క్యూట్ అంటే తెలుసా? అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు.. వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు, మాటలు, ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అంటూ మొదలైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. విజయ్ బుల్గానిన్ బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇందులో ప్రతి కథకు ప్రాముఖ్యత ఉందని, ఈ తరం యువతకు తగ్గట్టుగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సిరీస్ కు వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.ఇప్పటి వరకు ఓటీటీ అంటే మాఫియా, సెక్స్, ఎఫ్ వర్డ్ లు, ఇలా నానా బీభత్సం, ఫ్యామిలీలకు దూరం అనేట్లు చేసేశారు. దాంతో ఏ ఓటీటీ లో మన తెలుగు వాళ్లు వెబ్ సిరీస్ చేసినా, వెబ్ ఫిలిం లు చేసినా జనం పక్కన పెట్టేశారు. ఇలాంటి టైమ్ లో ఓ క్లీన్ అండ్ ఎమోషనల్ వెబ్ స్టోరీని నాని తీసుకొచ్చే ప్రయత్నం చేశారని ట్రైలర్ చేస్తే అనిపిస్తోంది.
This November 25th we are bringing you stories that will put a biggg smile on you ❤️@mail2ganta @SonyLIV @walpostercinema
Proudly presenting you
#MeetCute Trailer https://t.co/5iHeBR4SOy pic.twitter.com/pP9LTid36qAlso Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
— Nani (@NameisNani) November 18, 2022
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!