Chiranjeevi : ‘మా తాత రసికుడు.. నాకు ఇద్దరు అమ్మమ్మలు’.. వైరల్ అవుతున్న మెగాస్టార్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో, ప్రైవేట్ లైఫ్‌లో ఎంత హాస్యభరితంగా ఉంటారో అందరికి తెలిసిన విషయం. ‘చంటబ్బాయి’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’, ‘జై చిరంజీవా’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. ఇక రియల్ లైఫ్‌లో కూడా చిరంజీవి ఎంత పంచ్ లైన్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారో తెలిసిన విషయమే.
Read Also:Liquor Home Delivery: ఏలూరులో లిక్కర్ డోర్ డెలివరీ.. వీడియోలు వైరల్..
Also Read
తాజాగా చిరంజీవి హాస్యంతో మరోసారి అందరినీ నవ్వించారు. హైదరాబాద్‌లో బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన ‘బ్రహ్మ ఆనందం’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఫంక్షన్‌లో యాంకర్ సుమ, చిరంజీవి తాత గురించి మాట్లాడాలని కోరినప్పుడు, చిరంజీవి తన స్మృతులను హాస్యంగా పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “మా అమ్మ తరచూ చెప్పేది.. ‘నీకు ఎవరి బుద్ధులు వచ్చినా పర్లేదు కానీ, మీ తాత బుద్ధులు రాకూడదు’ అని. ఎందుకంటే తాత మాత రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు” అని ఫన్నీగా చెప్పారు.
Read Also:Niloufer Hospital: నీలోఫర్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. 27 వారాల గర్భవతిని కాపాడిన డాక్టర్లు!
ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు చిరంజీవి కామెడీ టైమింగ్‌ను మెచ్చుకుంటూ “బాస్ రూటే సపరేటు, బాస్ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం ఎవరి వల్లా కాదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి సరదా కామెంట్స్, ఆయన ప్రత్యేకమైన హాస్యభరితమైన వ్యాఖ్యలు ఆ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి.
Mana Chiranjeevi Gari Thathagaru 😍@KChiruTweets #MegastarChiranjeevi pic.twitter.com/Za161Ht8oO
— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) February 11, 2025
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!