Site icon NTV Telugu

Chiranjeevi: డిజిటల్ తెరపై మెగా రికార్డు! ఓటీటీలో ఒక్కరోజులోనే సరికొత్త చరిత్ర సృష్టించిన మెగాస్టార్..

Manashankaravaraprasadgaru

Manashankaravaraprasadgaru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మిషన్ అనిల్‌ రావిపూడి డైరెక్షన్ వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. ఈ చిత్రం థియేటర్‌లలో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా డిజిటల్ తెరపైకి వచ్చి అక్కడ కూడా రికార్డ్‌ను నెలకొల్పుతుంది. సంక్రాంతి కానుకగా వెండి తెరపై అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ మాధ్యమం అయిన జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది.

READ ALSO: Abhishek Sharma: అభిషేక్ శర్మ ఒక స్లాగర్, గొప్ప ఆటగాడు కాదు.. పాక్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్..

వెండి తెరపై ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ మరపురాని రికార్డులను ఎన్నో నెలకొల్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మెగా సినిమా కేవలం ఒక్క రోజులోనే అరుదైన రికార్డును నెలకొల్పింది. కేవలం ఒక్కరోజులోనే ఈ చిత్రం ఏకంగా 200 మిలియన్ల మినిట్స్‌ను సొంతం చేసుకొని, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త రికార్డ్‌‌ను సృష్టించినట్లు ZEE5 పేర్కొంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.375 కోట్లు వసూలు చేసి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో చేరింది. థియేటర్‌లోనే కాదు.. ఓటీటీలోనూ మెగాసార్ట్ ఊతకోత స్టార్ట్ అయ్యిందని మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నయనతార కనిపించగా, వెంకటేశ్‌ కీలక పాత్రలో సందడి చేశారు.

READ ALSO: Maha Shivaratri 2026: మహాశివరాత్రి రోజు ఈ 5 తప్పులు అస్సలు చేయకండి! శివయ్య అనుగ్రహం కోసం ఇలా చేయండి..

Exit mobile version