తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.. అంతేకాదు సాయం కోరిన వారికి సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. చిరంజీవి జీవితంలో జరిగిన ఎన్నో భాదకరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన సంచలన విషయాలను బయట పెట్టాడు..
ఓ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి తన జీవితంలో మర్చిపోలేని ఓ ఘటన గురించి చెప్పారు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. 1977 లో మద్రాస్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం వెతుకుతున్న రోజుల్లో.. ఒక రోజు ఓ స్నేహితుడు సరదాగా టీ తాగి వద్దాం రమ్మంటే పాండీ బజార్ వెళ్ళాము..అప్పుడు అక్కడ ఉన్న వాళ్లు నా గురించి అడిగితే అన్ని విషయాలను చెప్పాను..
వెంటనే వాళ్లు ఏంటి.. సినిమాల్లో ఛాన్స్ కోసం వచ్చావా? హీరోగా ట్రై చేద్దామని వచ్చాను అని సమాధానం చెప్పాను.. దానికి వారంతా నవ్వేసి ఏంటి హీరో అవుదామని వచ్చావా? ఇంకొక వ్యక్తిని పిలిచి… చూడు, వీడు ముక్కు ముఖం ఎంత చక్కగా ఉన్నాడో… వీడికే దిక్కులేదు… నువ్వు హీరో అయిపోతావా? అంటూ కామెంట్స్ చేశారు.. మేమంతా అందుకే వచ్చాము.. ఇదే పరిస్థితి ఉంది.. నీ మొహానికి అంత సీన్ లేదు అన్నట్లు హేళన చేసినట్లు చిరు చెప్పుకొచ్చారు.. అంతే ఆ ఘటన తర్వాత ఇక నేను ఎప్పుడూ పాండీ బజార్ వైపు వెళ్లలేదు.. నెగిటివిటి ఉన్న ప్రాంతాలకు వెళితే మనం కూడా అలా తయారవుతాము అని చిరంజీవి అన్నారు.. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా విషయానికొస్తే.. విశ్వంభర సినిమాలో చేస్తున్నాడు.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..