Site icon NTV Telugu

Bhaag Saale:‘భాగ్ సాలే’ టీమ్‎కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెష్

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Bhaag Saale:‘మత్తు వదలరా’ వంటి వినూత్న కథతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్ అందుకున్నాడు శ్రీసింహా. యంగ్ టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది. ఆ తర్వాత అదే స్పీడ్‌తో శ్రీసింహా ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ రొడ్డ కథ కావడంతో ప్రేక్షకులు వద్దు పో అన్నారు. విడుదలైన రెండు వారాల్లోనే ఆహాలో సందడి చేసి అక్కడ కూడా ప్లాప్ అయింది. ఆ తర్వాత ‘దొంగలున్నారు జాగ్రత్త’ వంటి సర్వైవల్‌ థ్రిల్లర్‌తో వచ్చి మరో ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు శ్రీసింహా. ప్రస్తుతం అతడి ఆశలన్నీ తన తదుపరి సినిమా భాగ్ సాలే పైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. ట్రైలర్‌తోనే మేకర్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అనంతరం శ్రీసింహా హీరోగా, నేహా సోలంకి నాయికగా భాగ్ సాలేలో నటిస్తున్నారు. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెష్ చెప్పారు. సినిమా ట్రైలర్ చూసి బాగుందని ప్రశంసించారు.

Read Also:IND vs IRE Schedule 2023: ఐర్లాండ్‌తో భారత్ టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌ ఇదే!

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – భాగ్ సాలే సినిమా ట్రైలర్ బాగుంది. శ్రీసింహా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. కామెడీ, మాస్, ఎంటర్ టైనింగ్ తో పాటు క్రైమ్ అంశాలతో సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. శ్రీసింహా కీరవాణి గారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే దాకా నాకు తెలియదు. వారసుడిగా కాకుండా తను స్వతహాగా ఎదగాలని కష్టపడుతున్నాడు. కీరవాణికి పేరు తెచ్చేంతగా గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా. అలాగే కాలభైరవ అంటే చరణ్ కు చాలా ఇష్టం. వీరిద్దరు మత్తు వదలరా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపైనా మంచి అవకాశాలతో తమ ప్రతిభను చాటుకోవాలి. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండంగా ఈ సినిమాను రూపొందించాడు. అలాగే నిర్మాత అర్జున్ దాస్యన్ మంచి ప్రయత్నం చేశాడు. ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

Read Also:Etela Rajender: హుజూరాబాద్ లో ఒక సైకో ఎమ్మెల్సీ ఉన్నాడు.. ఈటల హాట్ కామెంట్స్

Exit mobile version