NTV Telugu Site icon

Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. మామయ్యకు అల్లుడు విషెస్‌!

Allu Arjun Pawan Kalyan

Allu Arjun Pawan Kalyan

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా సోషల్‌ మీడియాలో టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి మద్దతు తెలపడానికి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి ఈ వార్‌ మొదలైంది. అప్పటినుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానులకు మధ్య నెట్టింట వార్‌ జరుగుతోంది.

Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

‘నాకు ఇష్టమైతే వస్తా’ అంటూ ఇటీవల అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్‌కు బన్నీ కామెంట్స్ మరింత అగ్గి రాజేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే పవర్‌ స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గారు’ అన్ని బన్నీ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఇది అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Show comments