Site icon NTV Telugu

Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..

Mega Victory Mass Song

Mega Victory Mass Song

Mega Victory Mass Song: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ యాంథెమ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

READ ALSO: 2025 Best Bikes : ఈ ఏడాది టాప్ 5 మోటార్‌సైకిల్ లాంచ్‌లు

ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ అదిరిపోయింది. ఎనర్జీతో నిండిన ఈ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ డాన్స్ పోజుల్లో అదరగొట్టారు. డెనిమ్ లుక్, సన్‌గ్లాసెస్‌తో చిరంజీవి మెగా స్వాగ్‌తో కనిపిస్తే, రెడ్ జాకెట్‌లో వెంకటేశ్ స్టన్నింగ్‌గా దర్శనమిచ్చారు. ఈ పోస్టర్‌లో ఇద్దరి మాస్ అప్పీల్, స్వాగ్ పీక్స్‌లో ఉన్నాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది.

READ ALSO: Champion: ఛాంపియన్ ఒరిజినల్ రాజిరెడ్డిని చూశారా!

Exit mobile version