మెగా అభిమానులకు ఇవాళ (డిసెంబర్ 13) నిజంగా పండగ వాతావరణం కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి ఒకేసారి కీలక అప్డేట్స్ రాబోతుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పీక్ స్టేజ్‌కు చేరింది. అందరూ ఆసక్తిగా ఈ సర్‌ప్రైజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Rajamouli: నా రెండు సినిమాలు సూర్య మిస్ అయ్యాడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ !
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి 2026 రిలీజ్ టార్గెట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్‌ను రాబట్టాయి. ఇక ఇప్పుడు అభిమానులు ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‌ను సాయంత్రం 5 గంటలకు జరగనున్న గ్రాండ్ ప్రెస్ మీట్‌లో అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ ఈవెంట్ ఈ సినిమాకు తొలి అవుట్‌డోర్ ప్రమోషనల్ కార్యక్రమంగా ఉండడం మరో ప్రత్యేకత.
ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ కూడా ఇవాళే స్టార్ట్ కానున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘డేఖ్‌లేంగే సాలా’ ఫుల్ వెర్షన్‌ను సాయంత్రం 5:30 గంటలకు రాజమండ్రి సమీపంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్లీ కలిసిన ఈ కాంబినేషన్ నుంచి మరోసారి సెన్సేషన్ ఖాయం అన్న అంచనాలు మెగా ఫ్యాన్స్‌లో భారీగా ఉన్నాయి.
