Mega Family: ప్రపంచ వ్యాస్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పండుగ ఏదైనా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరకు చేరి వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ షురూ చేశారు ఫ్యామిలీ మెంబర్స్. తాజాగా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీక్రెట్ శాంటా ఈవెంట్ ని నిర్వహించారు. ‘సీక్రెట్ శాంటా’ అంటే ఒకరికి ఒకరు సీక్రెట్ గిఫ్ట్స్ ఇచ్చుపుచ్చుకోవడం. దీంతో నిన్న మెగా కజిన్స్ అందరూ ఇందులో పాల్గొని ఒకరికి ఒకరు గిఫ్ట్స్ అందజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, నిహారిక తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో అందరూ కలిసి దిగిన ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. ఇక ఆ ఫొటోలో మెగాహీరోలు అందర్నీ ఒకచోట చూసిన అభిమానులకి కన్నుల విందుల ఉంది. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి పాల్గొనలేదు. ఇటీవలే రామ్ చరణ్ , ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లి అయిన 10 ఏళ్ళ తరువాత ఇప్పుడు వీరిద్దరూ ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నారు. ఈ విషయం తెలిసిన తరువాత మెగాహీరోలు అంతా ఒకచోట కలవడం ఇదే తొలిసారి. మెగా హీరోలందరిని ఒకేఫ్రేంలో చూసి ఫ్యాన్స్ అంత మురిసిపోతున్నారు.
Mega cousins #secretsanta ❤️🥳🎄
Lots of love & happiness pic.twitter.com/araFYLu0bn— Upasana Konidela (@upasanakonidela) December 21, 2022
