OTT Release: ఓటీటీ డివైజ్‌లు బద్దలైపోవాల్సిందే.. ఏడు భాషల్లో మెగా విధ్వంసానికి రెడీ అవుతున్న బాస్ సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Release: మెగా అభిమానులతో పాటు సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టాలీవుడ్‌లో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచి మెగాస్టార్ సినీ కెరీర్‌లో మరోమైలు రాయిగా అవతరించింది.
READ ALSO: Devara 2 Update: ‘దేవర 2’ అదిరిపోయే అప్డేట్.. ఈసారి థియేటర్లు దద్దరిల్లాల్సిందే?
Also Read
ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం తాజాగా డిజిటల్ తెరపై సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన జీ5 స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇందులో విశేషం ఏమిటంటే బాస్ సినిమా ఏకంగా ఏడు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ) స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2026న డిజిటల్ ప్రీమియర్ కానుందని టాక్. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీ రోల్‌లో సందడి చేశారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.
మన శంకర వరప్రసాద్ గారు కథ విషయానికి వస్తే..
శంకర వరప్రసాద్ (చిరంజీవి) ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కీలక అధికారి. అతను హోం మినిస్టర్ దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసే ఓ డైవర్సీ. ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ ఉమెన్ శశిరేఖ (నయనతార)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న శంకర వరప్రసాద్, తన పిల్లల్ని బాగా మిస్ అవుతూ ఉంటాడు. పిల్లలకు దగ్గరయ్యే ఉద్దేశంతో శశిరేఖకు తెలియకుండా కొన్ని ప్రయత్నాలు చేసినా, అవి పూర్తిస్థాయిలో సఫలం కావు. అయితే, శశిరేఖ తండ్రి జీవీఆర్ మీద అటాక్ జరగడంతో.. వారికి సెక్యూరిటీ ఆఫీసర్‌గా శంకర వరప్రసాద్ రంగంలోకి దిగుతాడు. అసలు శంకర వరప్రసాద్‌కు, శశిరేఖకు ప్రేమ ఎలా పుట్టింది? వారికి విడాకులు ఎలా అయ్యాయి? అసలు శశిరేఖ తండ్రి మీద అటాక్ చేసింది ఎవరు? ఆ ఎటాక్ చేసిన వ్యక్తిని శంకర వరప్రసాద్ అండ్ టీం కనుక్కుందా లేదా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.
READ ALSO: Dhurrander 2: అడివి శేష్ వర్సెస్ రణ్‌వీర్ సింగ్.. డెకాయిట్ రిలీజ్ డేట్ మారబోతుందా?
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!