కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్షాల సమావేశంలో 26 పార్టీలకు చెందిన 53 మంది నేతలు హాజరు అయ్యారు. రేపటి అజెండా 6 ముఖ్యమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఉమ్మడి కనీస కార్యక్రమాలను రూపొందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటుతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇది విపక్షాల పొత్తుల వారధిగా నిలువనుంది. కూటమి పరిణామాల గురించి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి పని చేస్తారు. కూటమి ఉమ్మడి కార్యక్రమాల ప్రణాళిక కోసం సబ్‌కమిటీ ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
Read Also: Supreme Court: ఆగస్టు 7న బిల్కిస్ బానో కేసు తుది వాదనలు
దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీల రాజకీయ ర్యాలీల నిర్వహణతో పాటు ఎక్కడెక్కడ సదస్సులు నిర్వహించాలి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఎలా ఏర్పాటు చేయాలి అనే దానిపై చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటి రూపకల్పనకు ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. సీట్ల కేటాయింపుతో పాటు రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీకి మరింత గుర్తింపు.. ఇచ్చేందుకు ఈ సందర్భంగా నేతలు తమ తమ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరిస్తున్నారు.
Read Also: Gangula Kamalakar : మిడ్ మానేర్ నీటిని విడుదల చేసిన మంత్రి గంగుల
ఎన్నికల్లో ఈవీఎం ఉపయోగించడం ద్వారా వచ్చే సమస్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ మీటింగ్ తర్వాత ఎన్నికల కమిషన్‌కు కొన్ని సూచనలు ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష కూటమికి పెట్టబోయే పేరు గురించి చర్చించే అవకాశం ఉంది. విపక్షాల కూటమికి అందరూ అంగీకరించే పేరును నేతలు ఖరారు చేయనున్నారు. కూటమికి నాయకత్వం వహించడానికి ఫెసిలిటేటర్‌ను నియమించనున్నారు. దీంతో పాటు ఈ ఆరు ముఖ్యమైన అంశాలపై విపక్ష పార్టీ నేతల సమావేశంలో చర్చ జరుగుతుంది.
Opposition leaders' dinner meeting gets underway in Karnataka's Bengaluru pic.twitter.com/HENPkecg1g
— ANI (@ANI) July 17, 2023
