Verity Theft: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. జరిగింది అనుకునే కంటే ప్రయత్నించారు అనేది ఉత్తమమేమో.. ఎందుకంటే అక్కడ ఏం పోలేదు.. నగల దుకాణంలో చోరీకొచ్చిన దొంగలు తమ ప్రయత్నం విఫలం కావడంతో సారీ అని ఓ చిట్టీపై రాసిపెట్టి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దీపక్ కుమార్‌కు చెందిన నగల దుకాణంలో చిన్నూ, మున్నూ అనే దొంగలు చోరీకి యత్నించారు. షాపులోకి ప్రవేశించేందుకు దుకాణం సమీపంలోని నాలా నుంచి ఏకంగా 15 అడుగుల పొడవు సొరంగం తవ్వారు. లోపలికి ప్రవేశించిన తర్వాత షాపులోని నగల పెట్టెను తెరవడంలో మాత్రం వారు విఫలమయ్యారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌తో నగల పెట్టెను తెరిచేందుకు సాధ్యపడలేదు. దీంతో.. వారు సారీ అంటూ ఓ చిట్టీపై రాసిపెట్టి వెళ్లిపోయారు. ఆ రోజు ఉదయం ఎప్పటిలాగే షాపు తెరిచిన దీపక్.. చోరీ ఆనవాళ్లను గుర్తించారు. ఘటనాస్థలంలో దొంగలు వదిలి వెళ్లిన చిట్టి లభించింది. అంతేకాకుండా.. గదిలోని కృష్ణుడి విగ్రహం కూడా గోడవైపు తిరిగి ఉండటంతో ఆయన ఆశ్చర్యపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Dulha Dulhan Course : పెళ్లి ప్రయత్నంలో ఉన్నారా.. తప్పకుండా ఈ కోర్స్ లో చేరండి
ఇక కృష్ణుడి విగ్రహం గోడవైపునకు తిరిగి ఉండటాన్ని బట్టి.. దొంగలు దేవుడి ముందు చోరీ చేసేందుకు భయపడి విగ్రహాన్ని గోడవైపు తిప్పి ఉంటారని షాపు యజమాని అభిప్రాయపడ్డారు. చోరీకి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లూ దొరక్కుండా నిందితులు షాపులోని సీసీ టీవీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, ఫుటేజీని తమతో తీసుకెళ్లిపోయారు. కాగా..షాపు పరిసర ప్రాంతాల్లోని సీసీకెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల జాడ కనిపెట్టేందుకు పోలీసులు ప్రస్తుతం యత్నిస్తున్నారు.
Read Also: Delhi Girl : ఢిల్లీలో ఘోరం.. దేశానికి కాదు దారుణాలకు రాజధాని