Dulhan Course : భారతదేశంలో గొప్ప ఇంజనీర్లు, వైద్యులు ఎలా కావాలనే దానిపై కోర్సులు ఉన్నాయి. కానీ విజయవంతమైన వైవాహిక జీవితాన్ని ఎలా గడపాలో ఏవీ బోధించవు. వాటిపై ఎలాంటి కోర్సు లేదు. చాలామంది పెళ్లి చేసుకుని అభిప్రాయ బేధాల కారణంగా తక్కువ కాలంలోనే విడాకులు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజలు ఉన్నారు.
ఇంట్లో భార్యభర్తలు ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ఎలా గడపాలి అనే ఆలోచనతో హైదరాబాదుకు చెందిన వ్యక్తి ఓ కోర్స్ రూపొందించాడు. అక్కడ ఆదర్శవంతమైన భాగస్వామిగా ఎలా ఉండాలో చెబుతారు. దీనికోసం సిలబస్ కూడా ఏర్పాటు చేశారు. ఫీజు కూడా నిర్ణయించారు. ఈ కోర్సు పెళ్లి అయిన వారికి, పెళ్లి కాని వారికి కూడా ఉంది.
Read Also: Wedding procession: అందరిలా చేస్తే ఏముంటది.. వెరైటీ ఉండాల్సిందే
భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణాలు
* ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే అహం ఉండటం
* ఇద్దరూ సంపాదించే క్రమంలో ఆర్థిక నిర్వహణ లేకపోవడం
* భార్య సంపాదిస్తుంటే భర్త ఇంట్లో ఉండటంతో గొడవలు
* ఆర్థిక ఇబ్బందులతో ఒకరినొకరు నిందించుకోవడం
* వరకట్న వేధింపులు
* అత్తమామలతో వివాదాలు
* ఇంటి పనుల్లో పరస్పర సహకారం లేకపోవడం
హైదరాబాద్‌లోని టోలీచౌకీకి చెందిన మహ్మద్ ఇలియాస్ 20 ఏళ్ల పాటు ఫ్యామిలీ కౌన్సెలర్‌గా పనిచేశారు. న్యాయ స్థానాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా కౌన్సెలింగ్, సలహాల వంటివాటిపై దృష్టిపెట్టినా భార్యాభర్తల మధ్య పరిస్థితులు అంతగా మెరుగుపడటం లేదని గమనించారు. తర్వాత టోలీచౌకిలో ఫ్యామిలీ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేశారు. పెళ్లికి ముందు, తర్వాత నేర్చుకునేందుకు వీలుగా ‘దుల్హ, దుల్హన్’ కోర్సు నిర్వహిస్తున్నారు. 2017లో సంస్థను ప్రారంభించగా రెండేళ్లు ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించారు. తర్వాత కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 1500 మంది కోర్సు చేశారు.
Read Also: Fire Accident: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు.. రామాంతపూర్ ఫర్నీచర్ గోడౌన్‌లో..
భర్త చేసే తప్పులు, భార్య ప్రాథమిక అవసరాలు, చేయవలసినవి, చేయకూడనివి, ఆదర్శవంతమైన భర్త లేదా భార్య ఎలా ఉండాలి. వివాహంపై మూర్ఖపు అంచనాలు, మీ భర్తను ఎలా గెలవాలి వంటి అనేక అంశాలు ఈ కోర్సులో ఉన్నాయి. కోర్సు ఫీజు రూ. 5,000గా నిర్ణయించారు. 15 సెషన్లు 45 నిమిషాలకు పైగా ఉంటాయి. వీటిలో కొన్ని టాపిక్స్ కవర్ చేస్తారు. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ కోర్సు అత్తమామలకు కూడా ఉంటుంది. వారు కోడలితో ఎలా ఉండాలి? త్వరగా బిడ్డకు జన్మనివ్వమని ఒత్తిడి చేయకుండా ఉండేందుకు మార్గాలను ప్రత్యేకంగా బోధిస్తారన్నమాట.